ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈయన మరణించి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఈయనని తలుచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత తొందరగా అయితే క్రేజ్ సొంతం చేసుకున్నారో అంతే తొందరగా ఈయన కెరియర్ ముగిసిందని చెప్పాలి.
ఈ విధంగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో హిట్ సినిమాలలో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీ ఎదుగుదలను చూసి కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈయనకు అవకాశాలు రాకుండా చేశారని తెలుస్తోంది. ఇలా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈయన మరణానికి సరైన కారణం మాత్రం తెలియడం లేదు.
ఇకపోతే ఉదయ్ కిరణ్ (Uday Kiran) మరణించడానికి పరోక్షంగా రాజమౌళి కూడా కారణం అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. సినిమాలు లేని సమయంలో రాజమౌళి ఆయనకు సై సినిమాలో నటించే అవకాశం కల్పించారట. అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి అవకాశం కల్పించగా కొందరు వారి ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి ఉదయ్ కిరణ్ ని ఈ సినిమా నుంచి తప్పించాలని రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటిస్తే సినిమాని మేము స్పాన్సర్ చేయము అంటూ చెప్పడం వల్ల రాజమౌళి తప్పనిసరి పరిస్థితులలో ఉదయ్ కిరణ్ ని ఈ సినిమా నుంచి తప్పించి ఆ అవకాశం నితిన్ కి కల్పించారు. అలా కాకుండా రాజమౌళి కనక ఈ అవకాశం ఉదయ్ కిరణ్ కే కనుక ఇచ్చి ఉంటే ఆయన తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేవారని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చేవి కాదు. ఈ క్రమంలోనే కొందరు రాజమౌళి కూడా ఈయన చావుకు పరోక్షంగా కారణమే అంటూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !