Rajamouli: వారానికో ప్లేస్‌ తిరిగేస్తున్న మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ జక్కన్న.. అసలు కారణం ఇదట!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి గురించి ‘బాహుబలి’ సమయంలో ఓ విశ్లేషకుడు రాస్తూ.. ‘ఆయన ఈటింగ్‌ సినిమా, డ్రింకింగ్‌ సినిమా, స్లీపింగ్‌ సినిమా..’ అంటూ రాసినట్లు గుర్తు. అంతలా ఆయనలో సినిమా లీనమైపోయింది అని చెప్పుకొచ్చారు. అదెంత వరకు నిజమో ఆయనతో పని చేసినవాళ్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన ఇదే పనిలో ఫ్యామిలీ ట్రిప్‌ను కూడా సినిమా కోసమే వాడేస్తున్నారా? అవుననే అంటున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు.

గత కొన్ని నెలలుగా రాజమౌళి తన కుటుంబానికే కేటాయించారు. సతీమణి రమతో కలసి రాజమౌళి దేశ విదేశాలను చుట్టేస్తున్నారు. వివిధ ప్రత్యేక ప్రాంతాలును చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజమౌళి నార్వే వెళ్లి అక్కడ స్పెషల్‌ స్టోన్స్‌ అయితన పల్పిట్‌ రాకస్‌ మీద భార్యతో ఫొటో దిగి.. ఎప్పుడో ‘మగధీర’ టైమ్‌లో చూడాలనుకున్నా ఇప్పుడు చూశా అని రాసుకొచ్చారు కూడా. అయితే ఇంతకుముందు కూడా రాజమౌళి చాలా ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు.

అయితే దీని వెనుక సినిమా ఆలోచన కూడా ఉంది అంటున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ కథను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. దాదాపు కథ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా ఇటు ఫ్యామిలీ ట్రిప్‌, మరోవైపు లొకేషన్ల రెక్కీ చేసేస్తున్నారట. ఇండియానా జోన్స్ త‌ర‌హాలో అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఈ సినిమా ఉండబోతోంది.

విలువైన వస్తువుల అన్వేషణలో భాగంగా మహేష్ బాబు ఈ సినిమాలో ప్రపంచం మొత్తం తిరుగుతాడట. అందులో భాగంగా ఏయే ప్రాంతాలు సినిమాలు చూపించాలి అనుకుంటున్నారో వాటిని ఇప్పుడు రాజమౌళి, రమ రెక్కీ చేస్తున్నారు అని టాక్‌. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చే సమ్మర్‌లో షూటింగ్‌ ప్రారంభించుకుంటుంది. అయితే ఎప్పుడు పూర్తవుతుంది అనే మాటలు రాజమౌళిని మనం అడగకూడదు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus