Ram Charan, Shankar: ఉన్న సినిమా సంగతే తెలియదు.. మరో సినిమా? కామెడీ కాకపోతే!

ఒక కాంబినేషన్‌ పూర్తయిన వెంటనే మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడం అసాధారణం. టాలీవుడ్‌లో అయితే ఇంకానూ. హీరో, హీరోయిన్ల విషయంలో ఇది అంతోకొంతో ఈజీ కాని, దర్శకుడు – హీరో విషయంలో చాలా కష్టం. అందులోనూ అగ్ర హీరో, అగ్ర దర్శకుడు అంటే ఇంకా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ మరో సినిమా అంటే నమ్మొచ్చా. అందులోనూ ‘గేమ్‌ ఛేంజర్‌’ అయిన వెంటనే అంటే నమ్మొచ్చా. కష్టమే కదా.. కానీ ఈ రూమర్‌ ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తెగ వినిపిస్తోంది.

రామ్‌ చరణ్, శంకర్‌, దిల్‌ రాజు కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా రూపొందుతోంది. ఎప్పుడో పూర్తయిపోవాల్సిన ఈ సినిమా ఆగుతూ ఆగుతూ ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ అయ్యే పరిస్థితిలో ఉంది. ఈ ఆలస్యాన్ని అన్ని వైపుల నుండీ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల సంగతి తర్వాత చూడొచ్చు.. ఇప్పుడు ఏకంగా చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది అని వార్తలు వచ్చాయి. దీంతో ‘ఉన్న సినిమా అయితే చాలు మళ్లీ ఇంకొకటా కామెడీ కాకపోతే’ అనే జోకులు మొదలయ్యాయి.

అయితే (Ram Charan) చరణ్‌, శంకర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ఇలాంటి ఆలోచనే లేదట. ప్రస్తుతం టీమ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్లో బిజీగా ఉందని, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తారని అంటున్నారు. అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా 2024 సంక్రాంతికి రావాలి. అయితే ఈ సినిమా అప్పుడు రావడం కష్టం. ఆ కారణంగానే విజయ్‌ దేవరకొండ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు దిల్‌ రాజు. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ రాక సమ్మర్‌లోనే అని అంటున్నారు. మరి అప్పటికైనా అవుతుందో లేదో చూడాలి.

శంకర్‌ – కమల్‌ హాసన్‌ కాంబోలో రూపొందుతున్న ‘ఇండియన్‌ 2’ను సమ్మర్‌లో తీసుకొస్తామని నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ ఇప్పటికే చెప్పేశారు. ఆ సినిమాను తెలుగులో దిల్‌ రాజు రిలీజ్‌ చేస్తారు. కాబట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’కు వేరే డేట్‌ అనుకుంటున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. సినిమా లుక్‌లు, వీడియో వస్తే కానీ ఈ విషయంలో క్లారిటీ రాదు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus