అదేంటో మెగాస్టార్ చిరంజీవి గారికి పోలీస్ పాత్రలు పెద్దగా కలిసి రాలేదు అని చాలా మంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ‘ఎస్.పి. పరశురామ్’ ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ ‘రుస్తుం’ వంటి చిత్రాలు చేదు అనుభవాల్నే మిగిల్చాయి. అయితే పార్ట్ టైం పోలీస్ గా చేసిన ‘మంచి దొంగ’ ‘స్టేట్ రౌడీ’ వంటి చిత్రాలు బాగానే ఆడాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతూనే వచ్చింది.
ఒక్క ‘గబ్బర్ సింగ్’ ను పక్కన పెడితే ‘కొమరం పులి’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి. ఇక బన్నీ ఒక్క ‘రేసు గుర్రం’ చిత్రంలో కాసేపు డమ్మీ పోలీస్ గా నటించాడు కానీ దానిని పూర్తిగా ఈ లిస్టులో వేయలేము. ఇక సాయి తేజ్ కూడా ‘నక్షత్రం’ అనే చిత్రంలో పోలీస్ గా నటించాడు. ఆది కూడా డిజాస్టరే…! ఇక చరణ్ మాత్రం… ఈ పాత్రలో ఎలా హిట్టు కొట్టాలి అని తెగ ట్రై చేస్తున్నాడు.
‘జంజీర్’ రీమేక్ అయిన ‘తుఫాన్’ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక తరువాత ‘తనీ ఒరువన్’ రీమేక్ ‘ధృవ’ లో పోలీస్ గా నటించి మెప్పించాడు. అయితే నోట్ల రద్దు టైములో వచ్చింది కాబట్టి.. ఎబౌ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఈ చిత్రం. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘ఆర్. ఆర్. ఆర్.’ లో పోలీస్ గా నటించబోతున్నాడు. ఇది రాజమౌళి సినిమా కాబట్టి పక్కా హిట్ అనే చెప్పాలి.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్