రానా సినిమాకి ఆర్ధిక ఇబ్బందులట..!

‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు రానా. ఇప్పుడు రానా చిత్రమంటే మినిమం నాలుగు భాషల్లో తెరకెక్కాల్సిందే.’నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తరువాత తెలుగులో రానా నటించిన చిత్రమేదీ రాలేదు. అయితే ప్రస్తుతం ‘నీది నాది ఒకే కథ’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి హిట్ అందుకున్న.. వేణు ఊడుగుల డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రానా రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా రానాతో సినిమాలు చేయడానికి తమిళ .. హిందీ దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చుపిస్తున్నారు. ప్రస్తుతం ‘హాథీ మేరీ సాథీ’ .. ‘హౌస్ ఫుల్ 4’ చిత్రాలను రానా చేస్తున్నాడు. ఇక తమిళ .. తెలుగు భాషల్లో ‘1945’ చిత్రం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు కూడా భారీ ప్రాజెక్టులు కావడం విశేషం.

అయితే వీటిలో ‘హాథీ మేరీ సాథీ’ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ‘1945’ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఈ చిత్రం ఆగిపోయిందట. ఇక ఈ చిత్రం కోసం ‘ఫండ్స్’ సేకరించడానికి పనుల్లో ప్రస్తుతం నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రానా సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus