Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని మరణాలు మిస్టరీలుగానే మిగిలిపోయాయి. వాటి గురించి సమాచారం ఉన్నా.. ఎక్కడా పెద్దగా చర్చ లేకుండా ముగిసిపోయాయి. అలాంటి వాటిలో యువ కథానాయిక ప్రత్యూష జీవితం ఒకటి. అనతి కాలంలోనే వరుస అవకాశాలు దక్కించుకుని తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌డమ్‌ను చూసిన నటి ప్రత్యూష. అయితే ఆమె కథ అనూహ్యంగా విషాదాంతమైంది. ఈ క్రమంలో ఆమె గురించి చాలా తక్కువమందికి మాత్రమే అసలు విషయాలు తెలుసు అంటారు. ఇప్పుడు వాటిని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం జరుగుతోంది అని సమాచారం.

Rashmika

అవును ప్రత్యూష జీవితంలో ఎదుర్కొన్న అంతుచిక్కని సంఘర్షణలు, ఆకస్మిక మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది చూపించడానికి టాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ పాత్ర కోసం ప్రముఖ కథానాయిక రష్మిక మందనను సంప్రదించారు అని సమాచారం. ప్రత్యూష హృదయ విదారక జీవితంలో ఒక సినిమా కథకు సరిపోయేంత భావోద్వేగాలు, సస్పెన్స్‌ను ఉన్నాయి. కాబట్టి సినిమాగా వస్తే ఆదరణ దక్కే అవకాశం ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు. 

ఇక ఆ పాత్రకు రష్మికనే ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. ప్రత్యూషకు దగ్గర పోలికలు రష్మికలో ఉన్నాయి కాబట్టి అనే సమాధానం వస్తోంది. అయితే ఈ సినిమా ఎవరు తీస్తారు, ఎవరు తీయిస్తారు అనే వివరాలు లేవు. కానీ టాలీవుడ్‌లో మాత్రం గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చూడాలి మరి ఎవరా దర్శకనిర్మాతలు. రష్మికకు ప్రస్తుతం ఉన్న స్టార్‌డమ్ కారణంగా ఈ బయోపిక్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు.

ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో ‘కాక్‌టైల్‌ 2’లో నటిస్తుండగా.. తెలుగులో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘మైసా’లో నటిస్తోంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్‌ దేవరకొండతో వివాహం జరగనుందని సమాచారం.

మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus