టాలీవుడ్‌లో పోటీ ఉండాలి… కానీ ఆ పోటీ పంతాలకు పోయింది ఇండస్ట్రీకి చేటు చేసేలా ఉండకూడదు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇదే జరగబోతోందా? ఇప్పటివరకు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలానే అయ్యేలా కనిపిస్తోంది. పిల్లి పిల్లల్ని ఇల్లు మార్చుకుంటూ వచ్చినట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ మారి, మారి ఆఖరికి జనవరి 7, 2022కి తీసుకొచ్చారు. అయితే అప్పటికే సంక్రాంతి రేసులో మూడు సినిమాలు వచ్చి కూర్చున్నాయి. దీంతో పోరు ఇంట్రెస్టింగ్‌గా మారింది. కానీ ఇది ఇండస్ట్రీకి అంతమంచిది కాదంటున్నారు.
గతంలోనూ సంక్రాంతికి ఒకటికి మించిన సినిమాలు వచ్చాయి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’తో అలా ఉండదు. సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తీశారు. బాక్సాఫీసు దగ్గర ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కనీసం రెండు వారాలు ఆడాలి. లేకపోతే నిర్మాతలకు నష్టం, తద్వారా ఇండస్ట్రీకీ నష్టం. ఆ లెక్కన జనవరి 7న ‘ఆర్‌ఆర్‌ఆర్’ వస్తుంది. అక్కడికి ఐదు రోజులకే ‘భీమ్లా నాయక్’ వస్తాడు. ఆ మరుసటి రోజే ‘సర్కారు వారి పాట’తో మహేష్‌బాబు వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్‌డే ‘రాధే శ్యామ్’గా ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు.
‘రాధే శ్యామ్’ కూడా పాన్ ఇండియా సినిమానే. పవన్, మహేష్ సినిమాల గురించి, అవి సృష్టించే మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరోల కంటే ప్రభాస్‌కే పాన్ ఇండియా ఇమేజ్ ఎక్కువ. దీంతో ఈ నాలుగు సినిమాల మధ్య టాలీవుడ్ – సంక్రాంతి నలిగిపోతాయి. దీంతో ఎవరు ఈ రేసు నుండి తప్పుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆఖరున రేసులోకి వచ్చి… ముందు డేట్ ప్రకటించేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’యే వెనక్కి వెళ్లాలి అని పరిశీలకులు అంటున్నారు.
మరోవైపు సినిమా ప్రచారం విషయంలో రాజమౌళి ఇంకా గుంభనంగా ఉన్నారు. దీంతో ఈ సారి కూడా సినిమా రిలీజ్ డేట్ మారుస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ సమ్మర్‌కే వెళ్లాలి. లేదంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’కి పవన్, మహేష్, ప్రభాస్ దారిచ్చేస్తారా అనేది చూడాలి. లేదంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇంకా కాస్త ముందే అంటే జనవరి 1కే కొత్త సంవత్సర కానుకగా వచ్చేయాలి. ఒక విధంగా టాలీవుడ్‌కి ఇదే బెటరేమో.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!