Jr NTR: తారక్‌ కూడా మెగా ఫ్యామిలీ నేపథ్యాన్నే ఎంచుకున్నాడా.. అందుకేనా?

తారక్‌ – కొరటాల శివ సినిమా నేపథ్యం ఏంటి? ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు.. ఏదో పాలిటిక్స్‌, యువత, బలహీనత, బలం అంటూ ఏదో పాయింట్లు చెప్పారు కదా.. ఆ మధ్య అంటారా? అవును అవన్నీ పాయింట్లే.. అయితే అసలు సిసలు నేపథ్యం ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్‌ పాయింట్‌. తారక్‌ సినిమా కోసం ఏకంగా ఓ దీవి సెట్‌ వేస్తున్నారని, పోర్ట్‌ సెట్‌ కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. సముద్రం, పెద్ద పెద్ద పడవలు ఇలా చాలానే సిద్ధమవుతున్నాయని ఓ టాక్‌ వచ్చింది.

దీంతో తారక్‌ కూడా మెగా ఫ్యామిలీ లాగే సముద్రం నేపథ్యం ఎంచుకుంటున్నాడా? అనే ప్రశ్న మొదలైంది. మెగా ఫ్యామిలీలో రీసెంట్ హిట్లు, కలిసొస్తున్న అంశాలు ఏంటి అని చూస్తే.. అందులో సముద్రం, సముద్ర ప్రాంతం, అక్కడి జనాలు కనిపిస్తారు. ‘రంగస్థలం’ సినిమాతో రామ్‌చరణ్‌ భారీ విజయాన్ని అందుకున్నాడు. అందులో చరణ్‌ గంగపుత్రుడుగా కనిపిస్తాడు. ఇక వైష్ణవ్‌ తేజ్‌ తొలి సినిమా ‘ఉప్పెన’ ఎక్కువ శాతం సముద్రం నేపథ్యంలోనే ఉంటుంది. ఇక మొన్నీ మధ్య వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ నేపథ్యం సముద్రమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇలా మెగా హీరోలకు సముద్ర నేపథ్యం బాగా కలిసొస్తోంది. ఇప్పుడు తారక్‌ కూడా అదే సముద్రం నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. పైన చెప్పినట్లు ఈ మేరకు సెట్స్‌ సిద్ధం చేస్తున్నారట. పోస్టర్లలో చూసినా డార్క్‌ బ్యాగ్రౌండ్‌లో వాటర్‌, తీరం కనిపిస్తున్నాయి. అవన్నీ కలిపి ఇప్పుడు సినిమా కాన్సెప్ట్‌ అంటున్నారు. తొలుత ఈ సినిమా విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఓ ప్రాంత నాయకుడు నేపథ్యంలో సినిమా అంటున్నారు.

‘ఆచార్య’ డిజాస్టర్‌ తర్వాత కథలో ఈ మార్పు చేశారా? లేక తొలుత నుండి ఇదే కథనా అనేది తెలియాల్సి ఉంది. ఇక తారక్‌ ఇటీవల చెప్పిన దాని ప్రకారం వచ్చే నెలలో సినిమా ముహూర్తం ఉంటుంది. ఏప్రిల్‌ నుండి షూటింగ్‌ జరిపి, వచ్చే ఏడాది సినిమా రిలీజ్‌ చేస్తారు. సినిమా ముహూర్తం రోజు కథ నేపథ్యం గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయి అంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus