‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’ సీక్వెల్స్‌ తీసుకురావడం అంత ఈజీనా.?

  • April 22, 2022 / 06:58 PM IST

సినిమా మొత్తం అయిపోయాక ఎండింగ్‌ టైటిల్స్‌లో ‘సీక్వెల్‌’ హింట్స్‌ ఇచ్చిన సినిమాలు మీరు చాలానే చూసి ఉంటారు… ఇదో రకం. సినిమా ప్రచారంలో భాగంగానే రెండో పార్టు తీస్తాం అని చెప్పేస్తుంటారు… ఇది మరో రకం. సినిమా విడుదలయ్యాక ప్రచారంలో భాగంగా సీక్వెల్‌ మాటలు బయటకు వస్తాయి. ఇది ఇంకో రకం. ఇలా ఇటీవల కాలంలో సీక్వెల్‌ ముచ్చట్లు వినిపించిన సినిమాలు ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘కేజీయఫ్‌’. అయితే వాళ్లు చెబుతున్నట్లు సీక్వెల్‌ చేయడం అంత ఈజీనా?

Click Here To Watch NOW

సినిమాకు సీక్వెల్‌ చేయాలి అంటే.. కొనసాగింపు సినిమా తీసే అవకాశం కథలో ఉండాలి. కథ సిద్ధంగా ఉండాలి. ఈ రెండూ ఉంటే సరిపోతాయా అంటే.. ఆ హీరో, దర్శకుడి, టీమ్‌కి టైమ్‌ ఉండాలి. పైన చెప్పిన రెండు సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌’కి అలాంటి పరిస్థితి లేదు. దీంతో వాళ్లు సీక్వెల్స్‌ అని అంటున్నా… నమ్మడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా ఒకటే.. దీనికి సీక్వెల్‌ లేదు అని సినిమా ప్రచారం తొలి రోజుల్లో చిత్రబృందం చెప్పింది. అయితే ఓ ఇంటర్వ్యూలో కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్ఆర్‌ 2’కి ఆస్కారం ఉందని చెప్పారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్ 2’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి రావడం… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ప్రచారం రావడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ ముచ్చట్లు ఏవీ కనిపించడం లేదు. ఆ సినిమా ఉందో లేదో కూడా తెలియడం లేదు.

ఇక ‘కేజీయఫ్‌ 3’ సంగతికొస్తే ఇది ఇంకో రకం. ‘కేజీయఫ్‌ 2’లో సీక్వెల్‌కి అవకాశం లేదు. మొత్తం సినిమా పాత్రలన్నీ క్లైమాక్స్‌ చనిపోయాయి. దీంతో మూడో పార్ట్‌లో ఏం చూపిస్తారు అనేది తెలియడం లేదు. నెటిజన్లు అయితే ‘కేజీయఫ్‌ 3’ అంటూ ట్రెండింగ్‌ చేసి ‘కేజీయఫ్‌ 2’ సినిమాకు ప్రచారం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి టీమ్‌ ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు కానీ నెటిజన్లు, ఫ్యాన్స్‌ అయితే అంటున్నారు.

ఇక ఈ రెండూ సాధ్యమా అని చూస్తే… ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ‘ఆర్‌ఆర్ఆర్‌’ కోసం చాలా టైమ్‌ ఇచ్చేశారు. ఇప్పుడు మళ్లీ రెండో పార్ట్‌ కోసం అంత టైమ్‌ ఇస్తారా అనేదే ప్రశ్న. తారక్‌కి కొరటాల, ప్రశాంత్‌ నీల్‌, బుచ్చిబాబు సినిమాలున్నాయి. ఇక చరణ్‌.. శంకర్‌, గౌతమ్‌ తిన్ననూరి, సుకుమార్‌, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలు చేయాలి. మరోవైపు రాజమౌళి.. మహేష్‌బాబు సినిమా చేయాలి. దీనికి కనీసం రెండుమూడేళ్లు పడుతుంది. కాబట్టి రాబోయే మూడేళ్లలో ‘ఆర్ఆర్ఆర్‌ 2’ కష్టమే.

ఇక ‘కేజీయఫ్‌ 3’ సంగతి చూస్తే.. యశ్‌ అయితే సినిమా చేయడానికి రెడీగా ఉండొచ్చు. కానీ ప్రశాంత్‌ నీల్‌ అలా కాదు. ‘సలార్‌’ పూర్తి చేయాలి. అందులోనూ ఈ సినిమా కూడా రెండు భాగాలు అంటున్నారు. ఆ తర్వాత ‘ఉగ్రమ్‌’ మురళీతో సినిమా చేస్తా అని చెప్పారు. దీని తర్వాత తెలుగులో మరికొన్ని సినిమాలున్నాయి అని సమాచారం. ఈ లెక్కన మళ్లీ యశ్‌తో సినిమా అంటే రెండు మూడేళ్లు పట్టొచ్చు. ఈ లెక్కన ఈ సీక్వెల్‌ కూడా ఇంత త్వరగా అవ్వదు. పూర్తిగా అవ్వకపోవచ్చు కూడా.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus