ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న స్టార్ యాంకర్..!

స్టార్ యాంకర్ శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ పక్క టీవీ షోలకు సినిమా ఈవెంట్ లకు, అవార్డు ఫంక్షన్ లకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటించింది శ్రీముఖి. జులాయి, నేను శైలజ,జెంటిల్ మెన్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తరువాత బిగ్ బాస్ 3 లో కూడా ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది. ప్రస్తుతం కొత్త కొత్త షో లతో ప్రేక్షకులను అలరిస్తుంది.

మొన్ననే పవన్ కళ్యాణ్ తో ఫోటోలు కూడా దిగి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీముఖి.. పెళ్లి విషయంలో పూర్తిగా తన అమ్మ నాన్న ల మాటే వింటాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఓ అబ్బాయి తో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా తనకు అత్యంత సన్నిహితుడు అయిన అబ్బాయితో ప్రేమలో ఉందట శ్రీముఖి. ఇటీవల వీళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

ఇంట్లో కూడా ఈ విషయాన్ని చెప్పారని.. అతి త్వరలోనే శ్రీముఖి పెళ్లి ఆ అబ్బాయితో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో శ్రీముఖి క్లారిటీ ఇస్తేనే కానీ చెప్పలేము.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus