Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

బుల్లితెర పవర్ స్టార్ గా సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) చాలా ఫేమస్. మెజీషియన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టిన ఇతను ‘జబర్దస్త్’ తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. సమాంతరంగా మరికొన్ని టీవీ షోలకి హోస్టింగ్ చేసి.. తన పాపులారిటీని మరింతగా పెంచుకున్నాడు. అది ఎంత వరకు అంటే సినిమాల్లో హీరోగా ఛాన్సులు అందుకునే వరకు..! అవును.. హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ ‘కాలింగ్ సహస్ర’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు సుధీర్.

Sudigali Sudheer

‘గోట్’ ‘హైలెస్సో’ వంటి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇలా ఓ పక్క హీరోగా సినిమాల్లో నటిస్తూనే.. బుల్లితెరపై టీవీ షోలతో కూడా యమ బిజీగా గడుపుతున్నాడు సుధీర్. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సుడిగాలి సుధీర్ వయసు ఇప్పుడు 39 ఏళ్ళు. అయినప్పటికీ ఇతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతని తమ్ముడికి కూడా పెళ్లైపోయింది. సో సుధీర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. యాంకర్ రష్మితో ఇతను ప్రేమలో ఉన్నట్టు చాలా కాలం వార్తలు వచ్చాయి.

కానీ అవి అబద్దం అంటూ వీళ్ళు తోసిపుచ్చడం జరిగింది. తర్వాత విష్ణుప్రియ, వర్షిణి వంటి వారితో కూడా సుధీర్ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ‘అవి కూడా అపోహలే’ అంటూ వాటిపై కూడా సుధీర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే.. సుధీర్ కి ఎంగేజ్మెంట్ అయినట్టు కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిల్లో కూడా నిజం లేదు. ఇవి 10 ఏళ్ళ క్రితం ఫోటోలు. సుధీర్‌కు 2014లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దానికి ‘జబర్దస్త్’ బ్యాచ్ రాకింగ్ రాకేష్, వంటి కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

కానీ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సుధీర్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్ళలేదు. చాలా మందికి ఇది తెలిసిన సంగతే..! అయినప్పటికీ ఈ పాత ఫోటోలు ఇప్పుడు ఎందుకు వైరల్ అయ్యాయనేది ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus