‘కంగువా’ (Kanguva) తో సూర్యకి (Suriya) పెద్ద డిజాస్టరే పడింది. ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.ఈ సినిమా ఫలితాన్ని మరిపించాలని సూర్య చాలా కష్టపడుతూన్నాడు. ఇందులో భాగంగా.. కార్తీక్ సుబ్బరాజ్ తో (Karthik Subbaraj) ఓ సినిమా చేస్తున్నాడు. అది 2025 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఇటీవల ఇంకో సినిమాని కూడా మొదలుపెట్టాడు సూర్య. వివరాల్లోకి వెళితే.. సూర్య 45వ సినిమా ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ఆర్.జె.బాలాజీ (RJ Balaji) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పొల్లాచిలోని ఓ టెంపుల్లో ఈ ప్రాజెక్టు మొదలైంది. త్రిష (Trisha) ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. డిసెంబర్ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం కథ గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా కథ తెలుగులో వచ్చిన రవితేజ ప్లాప్ సినిమా కథను పోలి ఉంటుందట.
ఆ సినిమా ఏంటంటే.. 2011 లో రవితేజ (Ravi Teja) హీరోగా ‘వీర’ (Veera) అనే సినిమా వచ్చింది. రమేష్ వర్మ (Ramesh Varma) ఈ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. చెల్లెలు కోసం, ఒక ఊరి కోసం.. ఓ వ్యక్తి పడే ఆవేదన ఆ సినిమా కథ. ‘2011 టైంకే ‘వీర’ రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా అని’ ఆడియన్స్ పెదవి విరిచారు. మరి అలాంటి సినిమా కథని ఈ టైంలో మళ్ళీ తీయడం అంటే అందరికీ చాలా కామెడీగా అనిపించొచ్చు.
సూర్య ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. మరి ఆర్.జె.బాలాజీ తో ‘వీర’ లాంటి అవుట్ డేటెడ్ కథని చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.’డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ వాళ్ళ సినిమాలు అయితే మినిమమ్ గ్యారంటీ అనే విధంగా ఉంటాయి. మరి ఈ రూమర్స్ కి క్లారిటీ రావాలంటే చాలా టైం పడుతుంది.