విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న థ్యాంక్ యు బ్రదర్ కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మూతబడటంతో ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అనసూయ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రమేశ్ రాపర్తి డైరెక్షన్ చేశారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది.
అయితే ఈ సినిమా ట్రైలర్ ను చూసిన కొంతమంది నెటిజన్లు ఈ సినిమా 2019 సంవత్సరంలో విడుదలైన నైజీరియన్ ఫిల్మ్ ఎలివేటర్ బేబీకు కాపీ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటర్ బేబీ సినిమాకు థ్యాంక్ యు బ్రదర్ సినిమా కాపీనా..? లేక ఆ సినిమా హక్కులు కొని ఈ సినిమాను రీమేక్ చేశారా..? లేక ఈ సినిమా దర్శకుడు సొంత కథతోనే తెరకెక్కించారా..? అనే ప్రశ్నలకు చిత్రయూనిట్ లో ఎవరో ఒకరు స్పందించి స్పష్టతనివ్వాల్సి ఉంది.
దాదాపు 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఆహా ఓటీటీ ఈ సినిమా హక్కులను కోటీ 80 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు నిర్మాత దగ్గరే ఉన్నాయని సమాచారం. సమీర్, అన్నపూర్ణ, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష, ఇతర నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అనసూయ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!