‘బ్రో డాడీ’… ఈ సినిమాను చిరంజీవి (Megastar Chiranjeevi) రీమేక్ చేద్దామనుకున్నారనే సంగతి మీకు తెలుసు కదా! మలయాళంలో మోహన్‌లాల్ (Mohan Lal) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్‌లో వచ్చి భారీ విజయం అందుకున్న సినిమా ఇది. తెలుగులో రీమేక్ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయి… ఇక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం అనుకున్న స్థితిలో సినిమా ఆపేశారు. చాలా నెలల పాట ఈ సినిమా కోసం పని చేసిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) ఇప్పుడు వేరే హీరోలకు కథలు చెప్పే పనిలో ఉన్నారు.
అయితే ఆ సినిమా రైటింగ్ టీమ్‌లో ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) పని చేశారని తెలుసు కదా. ఆయన ఇప్పుడు రచయితగా త్రినాథరావు నక్కిన (Trindha Rao) ఓ సినిమా చేస్తున్నారు. సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా ఆ సినిమా ఇటీవల అనౌన్స్ చేశారు కూడడా. అయితే అప్పుడు సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పలేదు. కానీ ఆ సినిమా నిర్మాత రాజేశ్ దండా (Rajesh Danda) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్ చెప్పారు. తండ్రీ కొడుకుల కథ ఇదని తేల్చేశారు. ఇందులో తండ్రిగా రావు రమేశ్ (Rao Ramesh) నటిస్తారని కూడా చెప్పారు.
దీంతో ‘బ్రో డాడీ’ సినిమా రీమేక్ ఇదే అంటూ ఓ చర్చ మొదలైంది. చిరంజీవి చేస్తాను అన్నప్పుడు తండ్రి పాత్ చుట్టూ తిరిగేలా మార్చిన కథను తిరిగి ఇప్పుడు కొడుకు పాత్ర చుట్టూ తిరిగేలా మార్చారు అని అంటున్నారు. ఇటీవలే ‘ఊరిపేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు సందీప్ కిషన్ . ఈ నేపథ్యంలో కాస్త వినోదాత్మక చిత్రం చేద్దామని చూస్తుండగా త్రినాథరావు నక్కిన – ప్రసన్నకుమార్ ఈ సినిమాతో ముందుకొచ్చారు అని అంటున్నారు. అయితే పూర్తిగా ‘బ్రో డాడీ’ కథనే తీయడం లేదు అనేది టీమ్ మాట.
ఆ సినిమా ఫ్లేవర్‌లో ఉంటుంది కానీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఫ్రెష్ రైటింగ్‌తో సినిమా చేస్తున్నాం అని అంటున్నారట. మరి నిజంగానే మార్చారా, లేక అదే తీస్తున్నారా అనేది సినిమా వచ్చాక కానీ లేదంటే ట్రైలర్ వచ్చాక కానీ తెలియదు.
షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?