మా బాలయ్య అలాంటి వాడు కాదు.. నమ్మండి..!

‘చూడటానికి కోపంగా కనిపిస్తాడు కానీ… ఆయన మనసు వెన్న… చిన్న పిల్లాడి మనస్తత్వం’… ఇవి బాలయ్య బాబు గురించి అందరూ చేసే కామెంట్స్. తన బసవతారకం హాస్పిటల్ లో డబ్బులు లేని ఎంతో మందికి ఉచితంగా వైద్యం ఇప్పించి… ఎంతో మందికి ప్రాణ దానం చేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలకు కూడా బాలయ్య ఎన్నో విధాలుగా సాయం చేసాడని… ఇప్పటికీ చేస్తూనే ఉంటాడు అని .. ఇండస్ట్రీలో ఎప్పటి నుండో టాక్ ఉంది.

ఆయన మాట తీరు ఎలా ఉన్నా… మనిషి బంగారం అని చాలా మంది చెబుతూనే ఉంటారు. అలాంటి బాలయ్య కరోనా బాధితుల సహాయార్థం కానీ తోటి చిన్న సినీ కళాకారుల విషయంలో కానీ సాయం చెయ్యడానికి ఇంకా ముందుకు రాలేదు. దాని వెనుక కారణం ఏంటనేది… ఇంకా తెలీదు. ఒకవేళ ఇచ్చినా బాలయ్య పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం..

తెలుగు సినిమా కార్మికుల కోసం పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి ప్రెసిడెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు కాబట్టి…. ఇది బాలయ్యకు నచ్చడం లేదని అందుకే విరాళం ఇవ్వడానికి బాలయ్య నిరాకరిస్తున్నాడని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజ నిజాలు ఎంత అనేది ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఇలాంటి కామెంట్స్ ఎందుకు అనేది మరికొందరి వాదన. మరి ఈ విషయం పై బాలయ్య నిర్ణయం ఏమిటో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus