Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

పని గంటలు, పేమెంట్‌.. ఈ రెండు విషయాల్లో తన మాట చెల్లకపోవడంతో దీపిక పడుకొణె ఇటీవల రెండు పెద్ద సినిమాల నుండి తప్పుకుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు చదువుతూనే ఉన్నాం. తొలుత ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ సినిమా నుండి తప్పుకోగా, ఆ తర్వాత ‘కల్కి 2’ సినిమా నుండి దీపిక ఎగ్జిట్‌ అయింది. ఇక్కడ ఆమె వెళ్లిపోయిందా, లేక తొలగించారా అనేది వేరే డిస్కషన్‌. ఈ రెండూ వదులుకుని అల్లు అర్జున్‌ – అట్లీ సినిమాను ఎందుకు ఓకే చేసింది. ఆమె రూల్స్‌కి ఆ టీమ్‌ ఓకే చెప్పిందా, వారికి లేని ఇబ్బంది వైజయంతి మూవీస్‌కి, సందీప్‌ వంగాకి ఏమొచ్చింది అనే డిస్కషన్‌ కూడా నడుస్తోంది అనుకోండి.

Deepika Padukone

ఈ క్రమంలో షారుక్‌ ఖాన్‌ కొత్త సినిమా కోసం దీపిక ఆ రెండు సినిమాలను వదులుకుంది అని కూడా ఓ వార్త వచ్చింది. అయితే ఇప్పుడు వేరే సినిమా పేరు చర్చలోకి వచ్చింది. ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమా పెద్దది అవ్వడమే దీపిక ఈ నిర్ణయం తీసుకుంది అనే చర్చ మొదలైంది. ఆ రెండింటిని మించిన పెద్ద సినిమా ఏంటి అని అనుకుంటున్నారా? ఆమె రెండో హాలీవుడ్‌ సినిమా. అవును దీపిక కొత్త హాలీవుడ్‌ సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ అనే తన తొలి హాలీవుడ్‌ సినిమాతో అదరగొట్టింది దీపికా పడుకొణె.

విన్‌ డీజిల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమా 2017లో వచ్చి భారీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతున్నట్లు సమాచారం. ఇందులో కూడా దీపికా పడుకొణె కూడా భాగం కానున్నట్లు హాలీవుడ్‌ సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగాన్ని దీపిక కోరిక మేరకు ముంబయిలో చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. తన కుమార్తె కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ షూటింగ్‌ త్వరలోనే ప్లాన్‌ చేస్తున్నారట.

 ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus