K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

‘కె ర్యాంప్‌’.. సగటు జనాలకు ఇది ఓ సినిమా టైటిల్‌. అదే సోషల్‌ మీడియా ట్రెండ్‌, బూతుల విషయంలో కొత్త పుంతలు గురించి తెలిసినవారికి ఇది కచ్చితంగా బూతు టైటిలే. కిరణ్‌ అబ్బవరం తన కొత్త సినిమాగా ఈ టైటిల్‌ను అనౌన్స్‌ చేసినప్పటి నుండి ఈ పేరు విషయంలో చర్చ నడుస్తూనే ఉంది. ఓ సినిమా ఇలాంటి డబుల్‌ మీనింగ్‌ అర్థమొచ్చే టైటిల్‌ ఎలా పెడతారు అంటూ కొంతమంది నేరుగా సినిమా టీమ్‌ దృష్టికే తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్‌ వెనుక అర్థముందని.. కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు వివరణ ఇస్తున్నారు.

K-Ramp

కిరణ్‌ అబ్బవరం చెబుతున్న వివరణ వినశఖ్యంగా ఉన్నా.. నమ్మశక్యంగా లేదు అని వాదనలు వినిపిస్తున్నాయి. కిరణ్‌ అబ్బవరం – జైన్స్‌ నాని కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘కె – ర్యాంప్‌’. దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో సినిమా టైటిల్‌ అర్థాన్ని దర్శకుడు జైన్స్‌ నాని వివరించారు. కె – ర్యాంప్‌ అంటే అసభ్యపదమని కొంతమంది అనుకుంటున్నారని.. కానీ దాని అర్థం కిరణ్‌ అబ్బవరం ర్యాంప్‌ అని చెప్పారు.

కిరణ్‌ అబ్బవరాన్ని దృష్టిలో పెట్టుకోని ఈ సినిమా స్క్రిప్ట్‌ రాశానని.. ఈ సినిమాలో హీరో పేరు కుమార్ అని.. అందుకే ‘కె – ర్యాంప్‌’ అని పేరు పెట్టామని వివరించారు. ఇదిలా ఉండగా సినిమాలో బూతులు పుష్కలంగా ఉన్నాయని ఇటీవల వచ్చిన రెండు టీజర్లు చూస్తే అర్థమవుతోంది. నేరుగా డబుల్ మీనింగులు పెట్టకపోయినా.. అలా అనిపించేలా డైలాగ్‌లు జాగ్రత్తగా రాసుకొచ్చారు. దీంతో ఆ టైటిల్‌కి అర్థం అసభ్యం కాదు అని చెబుతున్నా.. ఏదో నమ్మేలా అనిపించడం లేదు. అయితే ఇలాంటి అసభ్యపదాలకు దగ్గరగా ఉన్న పదాలు, డైలాగ్‌లు ఇటీవల ఓ సినిమాలో చూశాం. అన్నట్లు ఇదే సినిమా గురించి కూడా ‘కె – ర్యాంప్‌’ ప్రెస్‌ మీట్‌లో ప్రస్తావన వచ్చింది.

‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus