Andhra King Taluka: ఆయన కాకుండా వేరే హీరో ఉండి ఉంటే ‘ఆంధ్రా కింగ్‌’కి కనెక్ట్ అయ్యేవారా?

సినిమా కనెక్ట్ అయినట్లే ఉండి.. కనెక్ట్‌ కాకపోతే ఎవరైనా ఏం చేస్తారు. ఫలితం తేడా రావడం చూసి బాధపడటం తప్ప. ఇప్పుడు ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమా ఫలితం గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ మాటే అనాలని అనిపిస్తోంది రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన పాత్రలో మహేష్‌బాబు.పి తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ నటుడు ఉపేంద్ర మరో కీలక పాత్రధారి. ఈ సినిమాకు తొలుత వచ్చిన టాక్‌, రెస్పాన్స్‌ తర్వాత రావడం లేదు అని టాక్‌. ఏమైందా అని చూస్తే కనెక్టివిటీ లేకపోవడమే అని అంటున్నారు.

Andhra King Taluka

‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమా చూసిన వాళ్లు చాలామంది మంచి సినిమా, మంచి ప్రయత్నం, సినిమా అభిమాని జీవితాన్ని చక్కగా చూపించారు అంటూ మెచ్చేసుకుంటున్నారు. అయితే ఆ మాట సగటు ప్రేక్షకుల నుండి అంతగా రావడం లేదు అని చెబుతున్నారు. సినిమాకు తొలినాళ్లలో మంచి వసూళ్లు వచ్చి ఆ తర్వాత లేకపోవడానికి కూడా ఇదే అని అంటున్నారు. ఒక ఫ్యాన్ ఎమోషన్ తెర మీద నిజాయతిగా చూపించే ప్రయత్నం చేసినా ఫ్యానిజం ఎలివేట్ అయి, సాధారణ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్‌ అవ్వలేదు అని అంటున్నారు.

హీరో– ఫ్యాన్‌ వారి మధ్య ఉన్న ఫ్యానిజం గురించి అంతా పాజిటివ్‌ యాంగిల్‌లో చూపించేసరికి.. ఎక్కడో మూసగా అనిపించిందే టాక్‌ బాగా నడుస్తోంది. రామ్ పాత్రలో ఫ్యాన్‌, అతడు పడ్డ ఇబ్బందులే చూపించారు. అంతకుమించి కథలో వేరే యాంగిల్స్‌ టచ్‌ అవ్వలేదు. ఇక సినిమాలో స్టార్‌ హీరోగా చూపించింది కన్నడ స్టార్‌ ఉపేంద్రని. ఆయన తెలుగు ప్రేక్షకులకు తెలిసినా.. మన హీరో ప్రేమించే హీరో కూడా మనవాడు అయి ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవారు.

ఎవరి కోసం సాగర్‌ (రామ్‌) ఇదంతా చేస్తున్నాడో ఆయన పక్క పరిశ్రమకు చెందినవాడనే ఫీలింగ్‌ ఎక్కడో టచ్‌ అవుతోందని.. అందుకే అందరూ కనెక్ట్‌ అవ్వలేదు అని చెప్పొచ్చు. అయితే ఒక తెలుగు హీరోను ఆ పాత్రలో పెట్టి ఈ సినిమాను నడపడం అంటే కత్తి మీద సామే. అసలే మన దగ్గర ఫ్యానిజం మామూలుగా ఉండదు.

ఐబొమ్మ రవిని రాబిన్‌ హుడ్‌ని చేసింది టాలీవుడ్‌ కాదా.. ప్రేక్షకుల్ని అంటే ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus