Hari Hara Veera Mallu: పవన్ వీరమల్లుకు సమస్య ఇదేనా?

ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో క్రిష్ కెరీర్ లో కొంతకాలం గ్యాప్ వచ్చింది. వైష్ణవ్ తేజ్, రకుల్ కాంబినేషన్ లో ఒక సినిమాను తెరకెక్కించిన క్రిష్ దసరా పండుగ కానుకగా ఆ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ హరిహర వీరమల్లు పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది.

పవన్ నటిస్తున్న తొలి హిస్టారికల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై బాగానే అంచనాలను పెంచుకున్నారు. తెలుగు నేపథ్యం ఉన్న ఈ కథ ఇతర భాషల్లో సక్సెస్ అవుతుందా..? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు సమాధానంగా వినిపిస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి తెలుగులో హిట్ అయినా ఇతర భాషల్లో విడుదలై అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. అందువల్ల పవన్, ఈ సినిమా మేకర్స్ మొదట తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ సినిమాలో పంచమి పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus