ఫారిన్ కల్చర్ ఇక్కడ కూడా బాగా విస్తరిస్తున్నట్టే కనిపిస్తుంది. ప్రేమించామని పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్ళకు ‘అభిప్రాయాలు కలవడం లేదు.. ఇద్దరి ఆలోచనలు వేరు’ అంటూ విడిపోవడం. అసలు ‘అభిప్రాయాలు కలిశాయనే చెప్పి పెళ్లి చేసుకుని.. మళ్ళీ అభిప్రాయాలు కలవడం లేదు అంటూ విడిపోవడం ఏంటో..? చాలా మందికి అర్ధం కాని ప్రశ్నలు. ఇవి అన్నీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖుల జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సినీ పరిశ్రమలోనే ఎక్కువగా ఈ విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి.
సరే అసలు విషయానికి వస్తే.. ‘పొన్మగల్ వందాల్’ ‘అవలుమ్ నానుమ్’ ‘సొలోమన్’ ‘దేవం తందా వీడు’ వంటి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటి మేఘన.. ఇటీవల విడాకులు తీసుకుందట. 2017 లో డాన్ టోమినీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మేఘన. పెళ్లి తరువాత నటనకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. అయితే పెళ్లైన రెండేళ్లకే వీరిద్దరూ విడిపోయారట. అయితే వెంటనే విడాకులు తీసుకోలేదు.ఈ మధ్యనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు సమాచారం.
అభిప్రాయభేదాల వల్లే తాము విడిపోయినట్టు వీరిద్దరూ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు డాన్ టోమిని కూడా రెండో పెళ్లికి సిద్దమవుతున్నాడట. మేఘన కూడా తన సహా నటుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. షాకింగ్ విషయం ఏమిటంటే.. తన సహా నటుడితో ప్రేమాయణం మొదలు పెట్టాకే.. ఈమె తన భర్తకు దూరంగా ఉంటూ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!