Mokshagna: నందమూరి వారసుడి ఎంట్రీకి ఇంకా చాలా టైముందట

నంతదమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు? చాలా రోజుల నుండి ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. బాలకృష్ణ ఎవరైనా దర్శకుడు సినిమా తీసినా, మాట్లాడినా, కలిసినా, పలకరించినా.. ఆ దర్శకుడితోనే మోక్షజ్ఞ సినిమా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు మోక్షజ్ఞ కూడా ఇంకా హీరో రూపంలోకి రావడం లేదు. దీంతో ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడు? అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. దానికి వారానికో పుకారు వస్తూనే ఉంది. అయితే తాజాగా మరో సమాచారం వచ్చింది.

నందమూరి వార‌సుడు మోక్ష‌జ్ఞ వెండి తెర అరంగేట్రం గురించి అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌తీసారీ.. `ఈయేడాది మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయం` అంటూనే ఉన్నారు. ద‌ర్శ‌కులుగా ఎవ‌రెవ‌రి పేర్లో వినిపిస్తూ ఉండేవి. అది కాస్త వెన‌క్కి వెళ్తూనే ఉంది. 2022లోనూ ఇదే జ‌రిగింది. ఈ యేడాది మోక్ష‌జ్ఞ వ‌చ్చేస్తాడ‌ని చెప్పుకొన్నారంతా. అయితే ఆ దాఖ‌లాలు ఇప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించ‌లేదు. నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఆల‌స్యానికి కార‌ణం బాలకృష్ణనే అని అంటున్నారు.

బాలయ్య జాతకాలను బాగా నమ్ముతారు. ముహూర్తాల‌పై బాగా గురి ఎక్కువ‌. ఈ కారణాలతోనే మోక్ష‌జ్ఞను 2023లో అరంగేట్రం చేయిస్తే బాగుంటుంది అని ఫిక్స్‌ అయ్యారట. దీంతో ఈ ఏడాది సినిమా ప్రవేశం గురించి ఎలాంటి మాటలు ఉండవు అని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముహూర్తాలు బాగున్నాయ‌ని టాక్. దీంతో ఫిబ్రవరిలో మోక్ష‌జ్ఞ అరంగేట్రం ఉంటుందని, దానికి సంబంధించి ఈ ఏడాది ఆఖరులో అన్ని పనులు మొదలుపెడతారని అంటున్నారు.

ఈలోపు మోక్షజ్ఞ మరింత ఫిట్‌ అయ్యి.. సినిమాలకు రెడీ అవుతాడని టాక్. ఇక దర్శకుడు ఎవరు అనే విషయానికొస్తే బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి, రాహుల్‌ సాంకృత్యాన్‌ పేర్లు వినిపించాయి. మరోవైపు ‘ఆదిత్య 999’ సినిమాతో బాలయ్య దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. సో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎవ‌రితో, ఎప్పుడు అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగ‌క త‌ప్ప‌దు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus