Venkatesh: చరణ్‌ వస్తున్నాడు.. వెంకీ రాడు.. ఈ క్లారిటీ ఓకే.. మరి టైటిల్‌ మారుతుందా?

ఒక సినిమా వాయిదా పడటం అంటే.. ఆ సినిమా మాత్రమే కాదు.. చాలా సినిమాలు వాయిదా పడటం. అదేదో సినిమాలో డైలాగ్‌లా ఉంది కదా. సినిమాల పరిస్థితిని అర్థం చేయడానికి కాస్త అటు ఇటు మార్చి చెప్పాంలెండి. ఈ డైలాగ్‌ ఎందుకు అంటే.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) వాయిదా టాలీవుడ్‌లో చాలా మార్పులకు కారణమైంది. దీంతో సినిమా అభిమానులు.. ‘శంకరా (Shankar) .. ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా?’ అని అంటున్నారు. సినిమా స్టార్టింగ్‌ రోజునే రిలీజ్‌ డేట్‌ చెప్పడం ఒకప్పుడు బాలీవుడ్‌లోనే కనిపించేది.

Venkatesh

ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో కూడా వచ్చింది. అయితే అనుకున్నది అనుకున్నట్లు సినిమాలు రావడం లేదు. ఈ పరిస్థితి బాలీవుడ్‌లోనూ వచ్చింది. మన దగ్గర కూడా వచ్చింది. డిసెంబరు ఆఖరులో క్రిస్‌మస్‌కు వస్తాం అంటూ చెప్పిన దిల్‌ రాజు (Dil Raju) .. ఇప్పుడు సినిమాను సంక్రాంతి సీజన్‌కు మార్చారు. దీంతో చాలా సినిమాల డేట్లు మారిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తాం అంటూ వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi)  చెబుతూనే ఉన్నారు.

అంతేకాదు సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘గేమ్ ఛేంజ‌ర్’ కారణంగా ఆ సినిమా పొంగల్‌ సీజన్‌కు రావడం లేదు. దీంతో సినిమా పేరు కూడా మారుస్తారా అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌కి కాకుండా వేరే సీజన్‌లో వచ్చేటప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటే బాగోదు కనక. ఇక సంక్రాంతికి ఇప్పటికే ఖాళీ చేసిన ‘విశ్వంభర’  (Vishwambhara)  సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు.

మార్చి ఆఖరులో వస్తారు అని కొందరు అంటుంటే.. కాదు కాదు స్పెషల్‌ డేట్‌ మే9న వస్తుంది అని మరికొందరు అంటున్నారు. ఈ విషయం తేలితే వెంకీ – అనిల్‌ సినిమా సంగతి కూడా తేలుతుంది అని చెబుతున్నారు. ఇదంతా చూశాక పైన చెప్పినట్లు ‘శంకరా.. ఎంత పని చేశావయ్యా’ అని అనకమానదు. ఎందుకంటే ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆలస్యానికి ఆయనే కారణం కదా.

రెండు కథల మధ్య పోలికల వల్ల విశ్వంభరకు లాభమా? నష్టమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus