Trivikram: అల్లు అర్జున్ ను పక్కన ఆ సీనియర్ హీరోతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడా?

‘గుంటూరు కారం'(Guntur Kaaram)తర్వాత త్రివిక్రమ్ (Trivikram) నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలకి ఇది భిన్నంగా ఉంటుంది అనే టాక్ కూడా నడిచింది. అల్లు అర్జున్ (Allu Arjun) స్నేహితుడు, నిర్మాత అయినటువంటి బన్నీ వాస్ (Bunny Vasu).. ఆ ప్రాజెక్టు గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అది పాన్ ఇండియా సబ్జెక్ట్ అని, ప్రీ ప్రొడక్షన్ కి ఆల్మోస్ట్ సంవత్సరం టైం పడుతుంది అని ‘ఆయ్’ (AAY) సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.

Trivikram

కానీ ఏడాది కావస్తున్నా.. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కానీ, ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ ఓ కొలిక్కి రాలేదు అని టాక్. అనుకున్నదానికంటే ఎక్కువ టైం పడుతుంది అని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఏఐ టీంని రిక్రూట్ చేసుకుని వాళ్ళతో తన విజన్ ను కరెక్ట్ గా డిజైన్ చేయించి.. దాన్ని సినిమాటోగ్రాఫర్ వంటి టెక్నికల్ టీంకి కన్వే చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట.

సో ఇప్పట్లో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయడం కష్టమే. అందుకే అల్లు అర్జున్.. అట్లీని (Atlee Kumar) ఒక ఆప్షన్ గా పెట్టుకున్నాడు. అయితే త్రివిక్రమ్ మరో 6 నెలలు ఈ ప్రాజెక్టు పైనే వర్క్ చేస్తాడా? లేక ఈ గ్యాప్లో ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేస్తాడా? అనే చర్చలు కూడా నడుస్తున్నాయి. ఆ ఆలోచన త్రివిక్రమ్ కి ఉంది.

కానీ మిడ్ రేంజ్ హీరోతో కాకుండా సీనియర్ హీరో అయిన వెంకటేష్ వంటి వాళ్ళతో 6 నెలల్లో ఫినిష్ అయిపోయే సినిమా చేద్దామని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఒకవేళ వెంకీ ఒప్పుకోకపోతే.. అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తూనే ‘సితార’ బ్యానర్లో సహా నిర్మాతగా సినిమాలు చేస్తారు. అంతే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus