Varasudu: విజయ్‌ సినిమా విషయంలో దిల్‌ రాజు కొత్త ఆలోచన!

వచ్చే సంక్రాంతి సీజన్‌.. దిల్‌ రాజుకు ఇబ్బందిగా మారిపోయింది అని మొన్నీమధ్య మనం చెప్పుకున్నాం. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్‌.. తమ సినిమాలతో సంక్రాంతికి పోరులోకి దిగుతున్నారు. ఈ సమయంలో దిల్‌ రాజు తన సినిమా ‘వారసుడు’ను సంక్రాంతికి తీసుకొస్తే.. థియేటర్ల ఇబ్బంది వస్తుందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ సినిమాల్ని రిలీజ్‌ చేసేది ఈయనే.. తన సినిమాను కూడా తానే రిలీజ్‌ చేసుకోవాలి కాబట్టి. అయితే ఈ సమస్యకు దిల్‌ రాజు పరిష్కారం వెతికేశారని టాక్‌ నడుస్తోంది.

దిల్‌ రాజు తొలిసారి తమిళంలో నిర్మిస్తున్న చిత్రం ‘వరిసు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రమిది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ ఉంది. అగ్ర సహా నటుల్ని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు దిల్‌ రాజు టీమ్‌. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు. ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో పాటు విజయ్‌ ‘వరిసు’ / ‘వారసుడు’ తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు లెక్క మారిపోయింది.

బాలకృష్ణ తన ‘వీర సింహా రెడ్డి’ని సంక్రాంతి బరిలో నిలిపాలని ఫిక్స్‌ అయ్యాడు. అఖిల్ ‘ఏజెంట్‌’ కూడా సంక్రాంతికే అంటున్నారు. దీంతో ఎందుకు ఇబ్బంది అనుకున్నారేమో దిల్‌ రాజు తన సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. అయితే సినిమా పోస్ట్‌ పోన్‌ చేస్తున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సినిమాను ప్రీపోన్‌ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో ‘వరిసు’ ప్రమోషన్స్‌ తీరు చూస్తే అర్థమవుతోంది.

ఎప్పుడు జనవరిలో వచ్చే సినిమాకు ఇప్పటి నుండే ఎవరూ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయరు. కానీ ఇప్పుడు ‘వరిసు’ టీమ్‌ పనులు చూస్తే సినిమా డిసెంబరులో ఆఖరులో వస్తుందని లెక్క అర్థమవుతోంది. సినిమా కోసం తమిళ మీడియాకు వంశీ పైడిపల్లి, దిల్‌ రాజు ఇటీవల ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ను ఇటీవల విడుదల చేశారు కూడా. త్వరలో టీజర్‌ రిలీజ్ చేసి ప్రమోషన్స్‌ ఫుల్‌ స్వింగ్‌లో స్టార్ట్‌ చేస్తారని టాక్‌.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus