Vasishta, Balakrishna: బింబిసార సీక్వెల్ తర్వాత బాలయ్యతో సినిమా లేనట్టేనా?

‘బింబిసార’.. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా.. ఇంతకుముందు నిర్మాతగా ఇలాంటి ప్రయోగాత్మక ప్రయత్నాలు చేసి దెబ్బతినడంతో.. ఓన్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. కొత్త కుర్రాడు మల్లిడి వశిష్టను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. కథను నమ్మి.. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో కళ్యాణ్ రామ్ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తర్వాత ‘బింబిసార’ పార్ట్ 2 కూడా ఉంటుందని, తమ్ముడు తారక్ కూడా అందులో నటిస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు.

వీలుంటే నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా కనిపించే అవకాశముందని డైరెక్టర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఫస్ట్ సినిమానే ఇంత భారీగా తెరకెక్కించి, టైం ట్రావెల్ అనే రిస్కీ కాన్సెప్ట్ కి అదిరిపోయే స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన వశిష్టకు చాలా మంచి ప్రశంసలు లభించాయి. ‘బింబిసార’ రిలీజ్ కి ముందే టాక్ తెలిసి.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో బాలయ్య హీరోగా ఓ మూవీ చెయ్యడానికి అడ్వాన్స్ ఇచ్చారట.

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయే హీరోలు, దర్శకుల లిస్టులో చేరిపోయాడు వశిష్ట. ‘జాతిరత్నాలు’ తో సూపర్ హిట్ కొట్టి ఏకంగా తమిళ్ హీరోని తెలుగుకి పరిచయం చేసే ఛాన్స్ కొట్టేశాడు అనుదీప్. ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కి స్టోరీ చెప్పాడు వశిష్ట. చెన్నైలో రజినీని కలిసి ఆయన ఇమేజ్ ని, స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్ ని దృష్టిలో పెట్టుకుని రెడీ చేసుకున్న కథను సూపర్ స్టార్ కి వినిపించాడ వశిష్ట. కథ విన్న రజినీ బాగుందని చెప్పారట.

అయితే సినిమా చేస్తాను, చెయ్యను అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదట. దీంతో రజినీ సమాధానం కోసం ఎదురు చూస్తూనే.. ఇంతలో ‘బింబిసార’ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట వశిష్ట.. ఒకవేళ రజినీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాలయ్య సినిమా సంగతి ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ 21 నుండి జీ5లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ‘బింబిసార’ స్ట్రీమింగ్ కానుంది. రజినీ ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ మూవీ చేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus