Venkatesh: హిట్టు కథకు రీమేక్.. వెంకీ కూడా చేస్తున్నాడా?

మోహన్ లాల్ (Mohanlal)  నటించిన దృశ్యం సినిమా మొదటి భాగం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆ సినిమా, తెలుగులో వెంకటేష్  (Venkatesh) హీరోగా రీమేక్ అయ్యి ఇక్కడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండో భాగం కూడా అదే తరహా విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు దృశ్యం-3 పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా మోహన్ లాల్ దృశ్యం 3 అధికారికంగా అనౌన్స్ చేశారు.

Venkatesh

“గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు” అంటూ, మరోసారి జార్జ్ కుట్టి కథను తెరపైకి తీసుకురానున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో మాలీవుడ్ ఫ్యాన్స్ హుషారుగా ఉన్నారు. ఇక హిందీ వర్షన్ విషయానికి వస్తే, అజయ్ దేవగన్ (Ajay Devgn) మళ్లీ లీడ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. 2025లో ఆయన షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అయితే టాలీవుడ్ లో ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ ని కంటిన్యూ చేసే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

వెంకటేష్ ఈ రీమేక్ చేయబోతారా? లేక వేరే హీరో తో సినిమాను తీయబోతున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. వెంకటేష్, ఇప్పటికే అనిల్ రావిపూడితో (Anil Ravipudi)  సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)  అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే దృశ్యం 3 విషయంలో కూడా ఆయనను మాత్రమే ఫిక్స్ చేసే అవకాశం ఉందని టాక్. ఇంకా స్క్రిప్ట్ లాక్ అయితేనే వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుస్తుంది.

కానీ, వెంకీకి ఈ రోల్ బాగా సూట్ అవుతుందన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. మరోవైపు, దృశ్యం 3లో మరింత కాంప్లికేటెడ్ ట్విస్ట్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికి, మోహన్ లాల్ సెట్ అయిన దృశ్యం-3 తెలుగు వెర్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, వెంకటేష్ ఆ ప్రాజెక్ట్ లో అడుగు పెడతారో లేదో వేచి చూడాలి.

అందరికీ నచ్చే రూమర్‌ ఇది.. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus