Vijay: విజయ్‌ లాస్ట్‌ సినిమా ఏంటో చెప్పేశాడు.. ఎవరితో అంటే?

విజయ్‌ ( Vijay)చివరి సినిమా ఏంటో తేలిపోయిందా? గత కొన్ని రోజులుగా కోడంబాక్కం వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఇది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ‘రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తాను’ అని విజయ్‌ ఇప్పటికే అనౌన్స్‌ చేసేశాడు. దీంతో పవన్‌ కల్యాణ్‌ లాగా సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తాడా? లేక పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తాడా అంటూ ఓ ప్రశ్న వినిపించింది. తాజాగా ఈ విషయం గురించి దాదాపు క్లారిటీ వచ్చేసింది అంటున్నారు సన్నిహితులు.

రెండు పడవల ప్రయాణం చేయడం విజయ్‌కి ఇష్టం లేదు అనేది వారి మాట. చేతిలో ఉన్న సినిమాలు చేసి, ఫీల్డ్ నుండి తప్పుకుంటానని విజయ్‌ ముందే చెప్పాడు. అయితే నిజమేనా? అలానే చేస్తాడా? అనే ప్రశ్న ఉండేది. అలాగే ఆఖరి సినిమా ఏంటి? అంటూ మరో ప్రశ్న కూడా ఉండేది. అయితే ఇప్పుడు ఆ చర్చకు తెరపడింది అని చెప్పాలి. విజయ్ చివరి సినిమా లాక్ అయింది అంటున్నారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విజయ్‌… చివరి చిత్రం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

దర్శకుడు హెచ్.వినోద్‌తో (H. Vinoth) ఓ సినిమా చేయబోతున్నాడు. విజయ్‌కి ఇది 69వ చిత్రం కావడం గమనార్హం. అంతేకాదు ఇదే ఆఖరి చిత్రం కావడం పక్కా అంటున్నారు. వినోద్ సినిమాకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విజయ్‌. రాజకీయ కెరీర్‌కు ప్లస్ అయ్యేలా ఆ సినిమా ఉండబోతోంది అని సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి 68 సినిమాలతోనే కెరీర్‌ ముగించేద్దామని తొలుత అనుకున్నాడని…

కానీ లాస్ట్‌ పంచ్‌ బలంగా పడాలని 69వ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. జూన్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని, డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తారట. విజయ్‌ పొలిటికల్‌ ఐడియాలజీకి దగ్గరగా ఈ సినిమా ఉండబోతోంది అని అంటున్నారు. మరి ఏ సమస్యను ప్రధానంగా చేసుకుని ఆ సినిమా చేస్తారనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus