Ishq Movie: తేజ సజ్జ ‘ఇష్క్’.. హిట్ అవ్వడానికి ఎంత రాబట్టాలంటే..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. ఇప్పుడు హీరోగా మారి ఆల్రెడీ ‘ఓ బేబీ’ ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఇష్క్’ అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ఎస్.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఎన్వీ.ప్రసాద్, పరాస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ లు కలిసి నిర్మించారు. జూలై 30న అంటే ఈరోజు నుండీ థియేటర్లు తెరుచుకోబోతుండడంతో ఈ మూవీ కూడా విడుదల కాబోతుంది.

మరి ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఎంత వరకు జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  1.40 cr
ఏపి(టోటల్)  1.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.70 cr

 

‘ఇష్క్’ చిత్రానికి రూ.2.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిజానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. ఓటిటి సంస్థల నుండీ భారీ ఆఫర్లు వచ్చినా వాటికి నో చెప్పి మరీ థియేటర్లకు వచ్చింది ‘ఇష్క్’. మరి ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus