‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ బిజినెస్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సో.. సో సినిమాలతో లాగించేస్తున్న రామ్,పూరి లు ఎంతో కసిగా ఈ చిత్రాన్ని చేసారని టాలీవుడ్ సర్కిల్స్ చెప్పుకొస్తున్నాయి. అందుకు తగ్గట్టే సినిమా కూడా బాగా వచ్చిందని సమాచారం. జూలై 18 న(రేపు) విడుదల కాబోతున్న ఈ చిత్రం బుకింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో మొదటి రోజున అత్యధిక కలెక్షన్లు రావడం ఖాయం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ 38 కోట్ల వరకూ జరిగినట్టు టాక్ వినిపించింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం. అసలు లెక్కలు గమనిస్తే..

నైజాం – 6.50 కోట్లు
సీడెడ్ – 2.52 కోట్లు
వైజాగ్ – 1.40 కోట్లు

ఈస్ట్ – 1.05 కోట్లు
కృష్ణా – 0.95 కోట్లు
గుంటూరు – 1.10 కోట్లు

వెస్ట్ – 0.90 కోట్లు
నెల్లూరు – 0.48 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 14.90 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 1.20 కోట్లు
ఓవర్సీస్ – 0.90 కోట్లు
——————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 17 కోట్లు
——————————————————-

అదండీ.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకుని 20 కోట్లకు పైనే నిర్మాతలు పూరి, ఛార్మీ లకు దక్కినట్టు తెలుస్తుంది. మొత్తానికి నిర్మాతలకైతే లాభాలొచ్చాయి. మరి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే.. 18 కోట్ల నుండీ 20 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. లాంగ్ వీకెండ్ కలుపుకుని 15 కోట్ల వరకూ రావొచ్చని ట్రేడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారి నమ్మకం ఎంత నిజమైందో తెలియాలంటే వీకెండ్ ముగిసేవరకూ చూడాలి మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus