సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ బంధం ఇప్పటిది కాదు.ఎప్పటినుంచో సినీ రాజకీయ నాయకులు చాలా మిత్రులుగా కలిసి మెలిసిపోతూ ఉంటారు. చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తమ మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా సినిమాలలో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీల మధ్య ఎల్లప్పుడూ కూడా స్నేహపూర్వక సంబంధం కొనసాగుతూ ఉంటుంది.
ఎన్నో సినిమా ఈవెంట్లకు రాజకీయ నాయకులు ముఖ్య అతిథులకు హాజరవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజకీయ వేడుకలకు కూడా సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలెబ్రిటీలకు భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అందుకే సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అందరితో చాలా మంచిగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక రాజకీయాలు అన్న తర్వాత ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కనుక అందరితోనూ నాయకులు చాలా మంచిగా మెలుగుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ తాజాగా పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ గురించి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ విన్న పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం నటుడిగా మాత్రమే కాకుండా జనసేన నాయకుడిగా రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేటీఆర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనకు ఒక అన్నలాంటి వాడని కామెంట్ చేశారు. తను నాకు చాలా మంచి ఫ్రెండ్ ఎన్నోసార్లు మేము కలిసాము. మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. రాజకీయాలకు, స్నేహానికీ సంబంధం లేదనీ ఎవరి రాజకీయాలు వారివి అంటూ పవన్ గురించి కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!