గత బుధవారం నాడు రానా సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకుంటున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం నిజం లేదు కేవలం.. ఇరు కుటుంబ సభ్యులు కలిసి నిశ్చితార్ధం,పెళ్ళి కి సంబంధించి ముహుర్తాలు పెట్టుకోవడం అని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అయితే రానా మాత్రం ‘ఇట్స్ ఆఫీషియల్’ అంటూ తన ఫియాన్సీ తో ఉన్న పిక్ ను పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో రానా పంచెకట్టుతో ఉండగా… మిహీక చీరలో ఉంది.
దాంతో వీరిద్దరికీ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయిపొయింది అంటూ మళ్ళీ వార్తలు మొదలైపోయాయి. దానికి ఈ ఫోటోలను ఆధారులుగా చూపిస్తున్నారు. కానీ అసలు విషయం హీరో నాని వల్ల బయటపడింది. అవును రానా, నాని మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫోటోలు చూసిన నాని.. ‘అబ్బాయి… ఎంగేజ్మెంట్ అయ్యిందా?’ అంటూ రానాకు మెసేజ్ పెట్టాడు. ‘లేదు రోకా ఫంక్షన్’ అంటూ రానా సమాధానం ఇచ్చాడు. వెంటనే నాని ‘రోకా ఫంక్షన్’ అంటే ‘గూగుల్ చేస్తా’ అంటూ నాని బదులిచ్చాడు.
ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. ఇక ‘రోకా ఫంక్షన్’ అనేది ఎక్కువగా నార్త్ లో జరుగుతుంటుంది. వధువు,వరుడు… కుటుంబ సభ్యులు కలుసుకుని నిశ్చితార్ధం, పెళ్ళి ముహూర్తాలను ఫిక్స్ చేసుకోవడమే… అని తెలుస్తుంది. ప్రస్తుతం రానా, మిహీక లకు జరిగింది కూడా అదే అని తెలుస్తుంది. ఏదైతేనేం రానా వల్ల ఓ కొత్త విషయం తెలిసింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడం విశేషం.