Sowmya Rao: సౌమ్య రావు స్థానంలో కొత్త యాంకర్ గా బిగ్ బాస్ బ్యూటీ!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికి ఎంతో మంచి రేటింగ్స్ సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. దాదాపు దశాబ్ద కాలం పైగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇక ఈ కార్యక్రమంలో కమెడియన్స్ గా కొనసాగిన వారందరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగాను దర్శకులుగాను కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లోఈ కార్యక్రమానికి అనసూయ యాంకర్ గా వ్యవహరించేవారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఈమె కొంతకాలం పాటు బ్రేక్ ఇచ్చారు. అనంతరం రష్మీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనసూయ తిరిగి ఈ కార్యక్రమానికి వచ్చి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. అనసూయకు సినిమా అవకాశాలు రావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ పూర్తిగా వెండితెరకు పరిమితం అయ్యారు.

అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో తిరిగి (Sowmya Rao) సౌమ్య రావు అనే సీరియల్ ఆర్టిస్టును ఈ కార్యక్రమానికి యాంకర్ గా తీసుకోవచ్చారు ఈమె కూడా తన మాట తీరుతో బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారని తెలుస్తుంది. ఈ విధంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయం మాత్రం తెలియదు కానీ ఈ కార్యక్రమానికి మరొక కొత్త యాంకర్ వచ్చారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ గా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ హాజరు కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమానికి యాంకర్ గా రావడంతో ఈమెకు జడ్జెస్ అలాగే కమెడియన్స్ అందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. యూట్యూబ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి ప్రస్తుతం ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే అవకాశం అందుకున్నారు మరి ఈ కార్యక్రమం ద్వారా సిరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus