Kevvu Karthik: టాలీవుడ్లో మరో విషాదం.. ‘కెవ్వు కార్తీక్’ తల్లి మృతి

‘జబర్దస్త్’ కమెడియన్ గా పాపులర్ అయిన కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) ఇంట విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కార్తీ తల్లి చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో కొన్ని గంటల ముందు ఆమె మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా కార్తీక్ వెల్లడించారు. అతను ఈ విషయం పై స్పందిస్తూ.. “అమ్మ గత 5 యేళ్ల 2 నెలలు నుండి క్యాన్సరే భయపడే విధంగా దాని పై అలుపెరుగని పోరాటం చేశావ్.

నీ జీవితాన్ని చూస్తే అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు… నాన్నకి తోడుగా ఉండి కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు.ఈ 5 సంవత్సరాలుగా ఎలా ఒంటరిగా పోరాడాలి అనే విషయాన్ని నేర్పావు.నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది.ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్ధం కావడం లేదు. నాకు ఎందుకు దీనిని నువ్వు నేర్పలేదు?” అంటూ ఎమోషనల్ గా స్పందించాడు కార్తీక్. అలాగే ‘మా అమ్మ కోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు..

మా అమ్మ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం’ అని కూడా సందర్భంగా అతను డాక్టర్ల పట్ల తన విధేయతని చాటుకున్నాడు. ఇక కెవ్వు కార్తీక్ పోస్ట్ పై నెటిజెన్లు కూడా ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఓదార్పు కామెంట్లు పెడుతున్నారు. గతేడాది జూలైలో శ్రీలేఖ అనే అమ్మాయిని కెవ్వు కార్తీక్ వివాహమాడిన సంగతి తెలిసిందే.ఇంతలో ఇలా జరగడం విషాదకరం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus