ఈ వ్యాపారంలో జబర్దస్త్ కమెడియన్ సక్సెస్ అవుతారా?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన ఆర్పీ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత ఈ షో గురించి సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఆర్పీ రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కూకట్ పల్లి లోని మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఈ రెస్టారెంట్ ఏర్పాటైంది.

వైజాగ్ సత్యానంద్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ప్రారంభం కాగా ఈ బిజినెస్ లో ఆర్పీ సక్సెస్ అవ్వాలని జబర్దస్త్ అభిమానులు కోరుకుంటున్నారు. కట్టెల పొయ్యిపై మాత్రమే వంటకాలను వండుతామని ఆర్పీ వెల్లడించారు. పదేళ్ల క్రితమే రెస్టారెంట్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నానని ఇప్పటికి నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. సత్తెన్న పార్ట్ నర్ గా ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశామని ఆర్పీ వెల్లడించారు. స్విగ్గీ, జొమాటో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆర్పీ పేర్కొన్నారు.

నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆర్పీ వెల్లడించారు. ఇంటర్వ్యూల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన ఆర్పీకి గతంతో పోల్చి చూస్తే సినిమా, టీవీ ఆఫర్లు తగ్గాయి. ఆర్పీ ప్రవర్తన వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్పీ తన కలలను నెరవేర్చుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జబర్దస్త్, ఇతర షోల ద్వారా సంపాదించిన డబ్బును ఆర్పీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేశారని తెలుస్తోంది.

రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హాజరై తమ వంతు సపోర్ట్ చేశారు. జబర్దస్త్ షోకు దూరమైన కమెడియన్లు ఇతర కామెడీ షోలలో ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. ఆ షోలు ఆశించిన స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోలేదు. జబర్దస్త్ కమెడియన్లు ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus