Jabardasth Comedian: వేణు బాటలో మరో ‘జబర్దస్త్’ కమెడియన్.. ఎవరంటే..!
- October 10, 2023 / 12:25 PM ISTByFilmy Focus
కమెడియన్లు డైరెక్టర్లుగా మారడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. అయితే సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి స్టార్ కమెడియన్లు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేసినా అన్నీ ప్లాపులు అయ్యాయి. అయితే ఇటీవల ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు.. దర్శకుడిగా మారి ‘బలగం’ అనే సినిమా చేశాడు. అది సూపర్ హిట్ అయ్యింది. దిల్ రాజు బ్యానర్లో ఆ సినిమా చేయడం జరిగింది.

ఇప్పుడు అదే బ్యానర్లో ఇంకో సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు వేణులానే మరో జబర్దస్త్ స్టార్ కమెడియన్ కూడా దర్శకుడిగా మారడానికి రెడీ అయ్యాడు. అతను మరెవరో కాదు.. ధనరాజ్. అవును త్వరలోనే ధన్‌రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.ఈ చిత్రంలో సముద్రఖని ప్రధాన పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. దసరాకి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ధన్‌రాజ్, సముద్రఖని ఇద్దరూ `విమానం` అనే చిత్రంలో కలిసి నటించడం జరిగింది.

ఆ సినిమా షూటింగ్ టైంలో (Jabardasth Comedian) ధన్‌రాజ్… సముద్రఖనికి ఈ కథ చెప్పారట. ఇది కూడా ఎమోషనల్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. అలాంటి కథలకి సముద్రఖని వెంటనే కనెక్ట్ అయిపోతాడు. అందుకే ధనరాజ్ కి ఛాన్స్ దొరికినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ధనరాజ్ కూడా వేణులా హిట్ కొట్టి.. మరింత మంది జబర్దస్త్ కమెడియన్స్ కి స్ఫూర్తిగా నిలుస్తాడా.. లేక డైరెక్టర్స్ గా సక్సెస్ కానీ టాలీవుడ్ కమెడియన్స్ లా మిగిలిపోతాడా అనేది చూడాలి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు














