Yadamma Raju, Stella: విడాకులకు సిద్ధమైన కమెడియన్ యాదమ్మ రాజు!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంతోమంది కమెడియన్స్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు పొందినటువంటి వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోను సందడి చేస్తున్నటువంటి ఈయన గత ఏడాది స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా పెళ్లి జరిగి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంట గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అనుకుంటే పొరపాటే. ఇది ఒక బుల్లితెర కార్యక్రమం కోసం ఇలా విడాకులు థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బుల్లితెర పైప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం సరికొత్త థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.

ఈ క్రమంలోని ఈసారి విడాకులు థీమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇందులో భాగంగా కమెడియన్ యాదమ్మ రాజు స్టెల్లా ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు చూపించారు. ఇందులో స్టెల్లా మాట్లాడుతూ నీతో నావల్ల కావడం లేదు నాకు విడాకులు కావాలి అని అడుగుతుంది. అయితే ఆ విడాకులను కూడా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసే చాలా గ్రాండ్ గా ఇవ్వాలని చెప్పడంతో ఈ ఈవెంట్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇలా మీ షో రేటింగ్ కోసం పెళ్లయి ఏడాది కూడా కానటువంటి ఈ జంటను ఇలా విడాకులు తీసుకొనేలా చూపించడం ఏంటి అంటూ మండి పడుతున్నారు. ఇక మరికొందరు ఇదంతా కేవలం ఫన్ కోసమే చేస్తున్నారని కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈ దంపతులు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ భారీగానే ఆదాయం పొందుతున్నారు. అలాగే స్టార్ మాలో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ కార్యక్రమంలో కూడా ఈ జంట పార్టిసిపేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus