భారీ రెమ్యునరేషన్ ఆఫర్.. మేనేజర్ పర్సనల్ గా కలవమన్నారు!

టిక్ టాక్ వీడియోల ద్వారా చిత్తూరు యాసలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం బిగ్ బాస్ రివ్యూ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గీత రాయల్ అలియాస్ గలాటా గీతూ ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ ద్వారా గతంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ తనకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం అందుకే ఆర్జె అవ్వాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇకపోతే తనకు హోస్టింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఈమె గతంలో తనకు ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ చేస్తున్న సమయంలో ఆ ఈవెంట్ కి హోస్ట్ గా చేసే అవకాశం తనకు లభించిందని వెల్లడించారు. మూడు రోజులపాటు ఆస్ట్రేలియాలో ఉండటమే కాకుండా తనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు.

ఇలా ఆస్ట్రేలియాలో హోస్టింగ్, భారీ రెమ్యునరేషన్ అనేసరికి తాను ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నానని గీత తెలియజేశారు.ఇక అన్ని అయిపోయాయి టికెట్స్ బుక్ చేసుకునే సమయానికి ఈవెంట్ మేనేజర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. అతను ఫోన్ చేసి పర్సనల్ గా అన్ని ఓకే కదా మేడమ్ అని అడిగారు. అతను అలా అడిగే సరికి సహాయం కోసం అసిస్టెంట్ గురించి అడుగుతున్నారని ఓకే అని చెప్పాను.

అనంతరం ఆవ్యక్తి మాట్లాడుతూ అలా కాదు మేడమ్ మా మేనేజర్ గారితో మీకు పర్సనల్ గా ఓకే కదా అని అడిగారు. ఆయన అలా అడిగేసరికి కోపంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని ఈమె తెలిపారు. ఇలా క్యాన్సిల్ అని చెప్పే సరికి అతను పర్సనల్ గా కాకపోయినా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించండి అంటూ ఫోన్ చేశారు. అయితే తనకు భయం వేసి ఈ ఈవెంట్ నుంచి తప్పుకున్నానని ఈ సందర్భంగా గలాట గీతు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus