Jabardasth Rohini: పెద్దవారు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నా.. రోహిణి షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోహిణి కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్ సిరీస్ లలో సైతం రోహిణికి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండగా రోహిణిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల రోహిణి చేసిన ఒక ప్రాంక్ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఆ వీడియో గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ రోహిణిని హర్ట్ చేశాయి.

ఆ కామెంట్స్ గురించి రోహిణి స్పందిస్తూ బర్త్ డే బాయ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రేవ్ పార్టీ థీమ్ తో ఒక ప్రాంక్ వీడియో చేశానని సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిందని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో కేవలం ప్రమోషనల్ వీడియో అని నిజమైన రేవ్ పార్టీ కాదని చాలామందికి అర్థమైందని రోహిణి పేర్కొన్నారు. ఆ వీడియో గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ చుశానని ఆమె తెలిపారు.

ఏదైనా సంఘటన జరిగితే నిజమో కాదో తెలుసుకుని మాట్లాడాలని రోహిణి అన్నారు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయకూడదని ఆమె తెలిపారు. నేను మద్యం తాగనని సినిమాలో కొన్ని సీన్స్ లో అలా కనిపిస్తే రియల్ లైఫ్ లో అలా చేస్తామా అని ఆమె ప్రశ్నించారు. సర్జరీ వల్ల నేను లావు అయ్యానని నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సదరు జర్నలిస్ట్ కామెంట్ చేశారని లావుగా ఉంటే పెళ్లి చేసుకోకూడదా అని ఆమె ప్రశ్నించారు.

మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడం లేదని రోహిణి చెప్పుకొచ్చారు. మీరు పెద్దవారు కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నానని మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే నా సమాధానం మరోలా ఉండేదని రోహిణి పేర్కొన్నారు. రోహిణి కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రోహిణి కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus