జబర్దస్త్ యాంకర్ సౌమ్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. కన్నడ గ్లామర్ ఇండస్ట్రీలో ఆమె చాలా స్పెషల్. అందం, అభినయంతోపాటు సినిమాల రాత విషయంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. తెలుగు విషయంలో కాస్త అటు ఇటు ఉంటుందేమో కానీ.. నటనలో ముఖ్యంగా ఇమిటేషన్‌లో అదరగొట్టేస్తుంది. తాజాగా జబర్దస్త్ టీమ్ రిలీజ్ చేసిన ఈ వారం ప్రోమో చూస్తే వావ్ అనకమానరు. అందులో ఆమె షో జడ్జి ఇంద్రజను ఇమిటేట్ చేశారు. సౌమ్య కాస్త సౌమ్యజగా మారిపోయి అదరగొట్టింది.
జబర్దస్త్‌లో నూకరాజు టీమ్ ఈ సారి స్పెషల్ స్కిట్ చేసింది. అందులో భాగంగా ఇంద్రజను స్ఫూర్తి పొంది సౌమ్యజ అనే అమ్మాయి వచ్చింది అంటూ సౌమ్య రావ్‌ను తీసుకొచ్చారు. ఆమె డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ ఇంద్రజను ఇమిటేట్ చేసింది సౌమ్య. ‘‘ఆకాశం అమ్మాయైతే…’ అనే పాటతో అచ్చంగా ఇంద్రజలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చిన సౌమర్య… ‘‘మేడమ్ డ్యాన్స్ వేయొచ్చుగా…’ అని నూకరాజు అడగగా.. ‘‘వద్దురా నూకు, ఎందుకురా..’ అంటూ ఇంద్రజను ఇమిటేట్ చేసింది.
అందరూ మరీ మరీ అడగడంతో ‘ఓకే మ్యూజిక్ పెట్టండి…’ అని చెప్పి.. ‘వర్షం’ సినిమాలోని ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా…’ అనే పాట వేయడంతో కొంచెం బ్యాక్ చేయండంటూ ఇమిటేట్ చేసి నవ్వించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ గారూ ఈ పాటలో తేడా వస్తోంది అంటూ పాట ఆపించేసింది. ఆ తర్వాత తాను మాట్లాడుతున్నప్పుడు మిడిల్‌లో మాట్లాడొద్దు ప్లీజ్ ఇంద్రజ స్టైల్‌లో మందలిచింది. ఇలా ఈ ఎపిసోడ్‌లో సౌమ్యజ.. ఇంద్రజను మరిపించి నటించింది అని అంటారు.
అవును, రాత విషయంలోనూ సూపర్ అని స్టార్టింగ్‌లో అన్నారు చెప్పలేదేంటి అనుకుంటున్నారా? చెబుతాం, చెబుతాం. ‘అలా మొదలైంది’ సినిమా గుర్తుందా? అదేనండీ నాని – నిత్య మేనన్ సినిమా. ఆ సినిమాను కన్నడలో డబ్బింగ్ చేస్తే మొత్తం సినిమాను అక్కడ రైటర్‌గా చేసింది ఈమెనే. అదన్నమాట అసలు సంగతి. మల్టీ టాలెంటెడ్ సౌమ్య (Sowmya) అంటే మజాకానా ఏంటి?