Varsha: లక్డీకపూల్‌ రోడ్లపై వర్ష చేసిన అల్లరి మామూలుగా ఉండదు!

లేడీగెటప్‌లతో విసిగి వేసారిపోతున్న జబర్దస్త్‌ ప్రేక్షకులకు యాంకర్లు మాత్రమే గ్లామర్‌ టచ్‌ అద్దేవారు. అయితే మధ్యలో అప్పుడప్పుడు అమ్మాయిలు స్టేజ్‌ ఎక్కినా… అది తక్కువే అని చెప్పాలి. అయితే ఇదంతా వర్ష వచ్చేంతవరకే. ఏ క్షణాన ఆమె వచ్చిందో కానీ… ఆమె మీద ఏకంగా ట్రాక్‌లు, స్కిట్‌లు రాస్తున్నారు. అందం, చందం, అవసరమైన స్కిన్‌ షోతో జబర్దస్త్‌లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవ పిచ్చిదానిగా మారింది. అయితే అది కూడా టీవీ షో కోసమే.

వినాయక చవితి సందర్భగా ఈటీవీలో ‘ఊరిలో వినాయకుడు’ అనే ప్రత్యేక కార్యక్రమం టెలీకాస్ట్‌ చేశారు. అందులోనే అందాల వర్షను పిచ్చిదాన్ని చేశారు. ‘మారువేషం ధరించి ప్రజల్లోకి వెళ్లి… ఎవరికైనా ప్రపోజ్‌ చేసి, వాళ్లతో ఓకే అనిపించుకోవాలి?’ అని వర్షకు రామ్‌ప్రసాద్‌ టాస్క్‌ ఇచ్చాడు. దాన్ని ఎంతో స్పోర్టివ్‌గా తీసుకున్న వర్ష… ఎవ్వరూ గుర్తుపట్టకుండా భిక్షాటన చేసుకున్న అమ్మాయిగా మేకప్‌ వేసుకొని రోడ్డెక్కింది. లక్డీకపూల్‌ దగ్గర రోడ్లపై ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ కనిపించింది వర్ష.

ఈ క్రమంలో కొంతమంది అబ్బాయిల్ని ‘ప్రేమిస్తున్నా’ ఆట పట్టించింది. అయితే ఆమె గెటప్‌ చూసి… కొంతమంది స్థానికులు పరుగులు తీశారు. ఇంకోవైపు వర్ష చేస్తోన్న టాస్క్‌ చెడగొట్టడానికి ఇమ్మాన్యుయల్‌ యాచకుడిగా మారి రోడ్డెక్కాడు. ఇక ఆ ఇద్దరూ కలసి రోడ్‌ మీద వినోదం పండించారు చూడండి. మామూలుగా ఉండదు అది. అయినా అందాల వర్షను అలాంటి మేకప్‌ వేసుకోవడం ఏంటి?

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus