టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తన ప్రతిభను నిరూపించే దశలో ఉన్నాడు. RRR తో గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు ఓ డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో చరణ్‌లో ఉన్న నటన, మాస్ అపిల్‌ను మరోసారి చూపించింది. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడే ఓ ఊర మాస్ పాత్రను చరణ్ పోషిస్తున్న ఈ సినిమాలో నటనకు విపరీతమైన స్కోప్ ఉందని ఇప్పటికే నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ముక్కుకు, చెవులకు పోగులు, బీడీ చేతిలో పట్టుకుని మైదానంలో బ్యాట్‌తో షాట్ కొడుతున్న చరణ్ లుక్.. ప్రేక్షకులను ఊపేసింది. “ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా” అన్న డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసారి చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. రంగస్థలంలో (Rangasthalam) చిట్టిబాబు పాత్రకు అప్పట్లో నేషనల్ గ్యారంటీ అన్న భావన అందరిలోనూ ఉండేది.
కానీ కీర్తి సురేష్ (Keerthy Suresh) మహానటి (Mahanati) సినిమాతో పోటీ పడడంతో అది మిస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ నింపే అవకాశం పెద్దితో ఉందనే నమ్మకం మెగా క్యాంప్‌లో బలంగా ఉంది. ఈ సినిమాలో ఏ.ఆర్. రెహ్మాన్ (A.R.Rahman) సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు మరింత హైప్‌ను పెంచుతున్నాయి. ఒక పక్క స్టైల్, మాస్ అపిల్.. మరోవైపు పాత్రలో ఉన్న లోతైన భావోద్వేగాలు చరణ్‌కు పర్ఫామెన్స్ స్కోప్ భారీగా ఇచ్చేలా ఉన్నాయి.
అందుకే పెద్ది సినిమా నేషనల్ అవార్డ్ స్థాయి చిత్రం అవుతుందన్న టాక్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటినుంచే సంబరాల్లో మునిగిపోయారు. రంగస్థలం తర్వాత మళ్లీ చరణ్ పెర్ఫార్మెన్స్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఆ కల నిజమవుతుందా? అంటూ సినీ లో ఆసక్తి పెరిగిపోతోంది.