Rakul Preet: నువ్వే నా ధైర్యం అంటూ రకుల్ పై ప్రేమ కురిపించిన జాకీ!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బాలీవుడ్ సినిమాలలో మాత్రం ఎంతో బిజీగా గడుపుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వెళ్లారు అయితే అక్కడ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఏమాత్రం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని ప్రేమలో పడిన విషయం తెలిసిందే.

ఇక వీరిద్దరూ ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇలా (Rakul Preet) రకుల్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సమయం దొరికిన తన ప్రియుడుతో ఆ క్షణాలను గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇకపోతే రకుల్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు సెలబ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఆమె ప్రియుడు జాకీభగ్నాని సైతం సోషల్ మీడియా వేదికగా రకుల్ పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ..నీకు ఎంతో ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను నిత్యం సర్ప్రైజ్ చేసే వ్యక్తి గురించి నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నీతో ఉంటే నాకు ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్రయాణం అనే ఫీలింగ్ ఉంటుంది. నువ్వే నా ధైర్యం నా ప్రతి అడుగులోనూ నువ్వే నా భాగస్వామి. నీకు ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున నువ్వు కన్న కలలన్నీ కూడా నెరవేరాలి కచ్చితంగా నెరవేరుతాయి వాటిని అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తివి నీవు.

ప్రతిరోజున ఎంతో అద్భుతంగా మార్చే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈయన తన ప్రియురాలి పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఇలా తన ప్రియుడు చేసినటువంటి ఈ పోస్ట్ పై స్పందించిన రకుల్ థాంక్యూ మై డియర్ లవ్ అంటూ రిప్లై ఇచ్చారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus