Jagan, Roja: పవన్ కుమారుడిపై రోజా ఊహించని రియాక్షన్!

సింగపూర్‌లో అగ్నిప్రమాదానికి గురైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గురించి అందరిలో ఆందోళన కలిగింది. సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్టు సమాచారం. ప్రస్తుతం అతడు అత్యవసర చికిత్స పొందుతున్నాడని పవన్ కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తనపై స్పందిస్తున్నారు.

Jagan, Roja

ఈ విషయంలో పవన్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా రియాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ మొట్టమొదటిగా స్పందించారు. “సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బాధాకరం. పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి బాధ కలిగింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. వారి రాజకీయ వైవిధ్యాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయంలో మానవీయత ప్రదర్శించిన జగన్ అభినందనీయంగా మారింది.

ఇక పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్‌పై అప్పుడప్పుడూ స్పందించే వైసీపీ సీనియర్ నేత రోజా కూడా ఈ ఘటనపై హృదయపూర్వకంగా స్పందించారు. “పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాదంలో గాయపడిన వార్త ఎంతో బాధ కలిగించింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రోజా (Roja) స్పందన మానవీయతను ప్రతిబింబించిందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్, పరిస్థితిని సమీక్షించేందుకు సింగపూర్‌ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. చరణ్ (Ram Charan), చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), లోకేశ్, కేటీఆర్ తదితరులు ఇప్పటికే పవన్ కుమారుడి ఆరోగ్యంపై తమ ఆకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘గెట్ వెల్ సూన్ మార్క్’ అంటూ పోస్టులతో నిండిస్తున్నారు. మొత్తానికి ఘటన పవన్ కుటుంబానికి కాస్త కుదుపు ఇచ్చినప్పటికీ, అభిమానుల ప్రేమ, రాజకీయ నేతల మద్దతుతో మానసికంగా ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు అందరి చూపు మార్క్ ఆరోగ్య పరిస్థితిపై ఉంది. ఆ చిన్నారి త్వరగా కోలుకుని, ఆరోగ్యంగా తిరిగిరావాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.

మార్క్‌ శంకర్‌కి గాయాలు.. చూడటానికి వెళ్లిన శివశంకర్‌ వరప్రసాద్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus