Jagapathi Babu: కోవిడ్ మందుని ప్రమోట్ చేస్తోన్న జగపతి!
- June 5, 2021 / 03:35 PM ISTByFilmy Focus
నెల్లూరుకి చెందిన ఆనందయ్య కోవిడ్ మందు కొన్నాళ్లుగా వార్తలో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మందుపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఆనందయ్య మందు పంపిణీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. సీనియర్ హీరో జగపతిబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తాను ఎప్పుడో వేసుకున్నానని.. ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతానని అన్నారు జగపతి బాబు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ అందరికంటే ముందుగా ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో తాను కూడా ఒకడినని.. ఆల్రెడీ ఆనందయ్య మందుని తను వాడినట్లు.. తనకు కరోనా రాలేదని జగపతిబాబు చెప్పారు. ఆయుర్వేదం అనేది తప్పు చేయదని.. శరీరానికి హాని చేయదని అన్నారు. నేచర్, భూదేవి తప్పు చేయదని తెలిపారు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశానని.. ఎవరేం నమ్మినా సరే.. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవని చెప్పారు.

ఇంతకముందు కూడా ఆనందయ్య మందుని నిషేధించాలని విమర్శలు వచ్చినప్పుడు కూడా జగపతి బాబు స్పందించారు. ఆనందయ్య మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు తను ఆ మందు వేసుకున్నానని.. లక్కీగా తనకు కోవిడ్ రాలేదని.. చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!












