స్వప్నలోకం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత విబి రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతి బాబు, ఫస్ట్ సినిమాతోనే నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత నుండి తన టాలెంతో తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన జగపతి బాబు 1990ల్లో ఫ్యామిలీ హీరోగా అనేక సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు. ఇక ఇటీవల బాలయ్య తో బోయపాటి తీసిన లెజెండ్ మూవీతో విలన్ గా సరికొత్త గెటప్ లో కనిపంచి అందరినీ తన యాక్టింగ్ తో థ్రిల్ చేసిన జగపతి బాబు,
ఆ తరువాత నుండి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమా ఛాన్సులు అందుకుంటూ కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం జగ్గు భాయ్ చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ మూవీలో సలార్ లో రాజమనార్ అనే రోల్ చేస్తున్నారు. అలానే నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీశ్ లో ఆయన సోదరుడిగా, అజయ్ భూపతి తీస్తున్న మహాసముద్రంలో ఒక కీలక క్యారెక్టర్, నాగ శౌర్య హీరోగా నటిస్తున్న లక్ష్య లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.
అలానే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని మూవీ లో ఒక పాత్ర, సాయి ధరమ్ తేజ్ తో దేవాకట్టా తీస్తున్న రిపబ్లిక్ లో ఒక మెయిన్ రోల్, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాతో శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న హీరోలో ఒక ముఖ్య రోల్, కన్నడ మూవీ మదగజ లో ఒక ముఖ్య పాత్ర తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో శివ తీస్తున్న అన్నత్తే మూవీ లో కూడా ఒక మెయిన్ రోల్ చేస్తున్నారు. అయితే జగపతి నటిస్తున్న ఈ సినిమాల్లో కొన్ని సక్సెస్ సాధించినా సరే నటుడిగా అయాన్ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.