Guppedantha Manasu September 25th: కొడుకుని ప్రమాదం నుంచి కాపాడుబోయి ప్రమాదంలో పడిన జగతి!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. తాను చేసిన పని కారణంగా చివరికి ఫణీంద్ర మహేంద్రను కూడా అసహ్యించుకుంటున్నారు ఎలాగైనా నేను రిషికి నిజం చెప్పి రిషి పై ఎలాంటి మచ్చ లేకుండా చేయాలి అంటూ జగతి ఒక నిర్ణయానికి వచ్చి రిషికి ఫోన్ చేస్తుంది అయితే రిషి మాత్రం లిఫ్ట్ చేయరు. రిషి లిఫ్ట్ చేయకపోయినా జగతి మాటిమాటికి ఫోన్ చేస్తూ ఉండడంతో హరీష్ కాల్ బ్యాక్ చేసి మీరు నాకు ఇలా ఫోన్ చేయకండి మేడం అంటూ ఫోన్ పెట్టేస్తాడు అయినప్పటికీ జగతి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి అని చెప్పిన మీరు ఏం చెప్పినా నేను వినను నాకు ఫోన్ చేయకండి అంటూ ఫోన్ కట్ చేస్తారు.

ఎలాగైనా ఈ విషయాన్ని రిషికి చెప్పాలని భావించినటువంటి జగతి ఒక లెటర్లో శైలేంద్ర చేసిన మోసాలు అన్నింటిని రాసి ఇది ఎలాగైనా రిషికి చేరేలా చేస్తాను అని భావిస్తుంది. అయితే ఆ లెటర్ చూసిన మహేంద్ర ఏంటి జగతి ఇది అని అడగడంతో రిషికి నిజం చెప్పాలని అనుకుంటున్నాను తనపై నేను వేసిన మచ్చ తొలగిపోయి తాను సంతోషంగా తిరిగి ఇక్కడికి వచ్చేలా చేస్తాను అంటూ మాట్లాడటంతో ఈ మాటలన్నీ శైలేంద్ర విని షాక్ అవుతారు. ఎలాగైనా ఆ రిషిని పిన్నిని ఇద్దరిని అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అవుతారు.

మరోవైపు ఏంజెల్ ఫోన్ చేసి తాను విశ్వం వారం రోజులపాటు ఇంట్లో ఉండమని కాలేజీని జాగ్రత్తగా చూసుకోమని తనకు చెబుతుంది. దీంతో మరుసటి రోజు ఉదయం కాలేజ్ క్యారిడార్ లో జగతి మేడం ఎందుకు నాకు ఫోన్ చేశారు కాలేజ్ ఏమైనా సమస్యల్లో ఉందా అని ఆలోచనలో పడతాడు అప్పటికే అక్కడికి వసు రావడంతో ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడగ్గా రాత్రి జగతి మేడం ఫోన్ చేసింది. కాలేజీ ఏదైనా సమస్యల్లో ఉందా మీకు ఏమైనా ఫోన్ చేశారా అంటూ రిషి అడగగా వసుధార మాత్రం తనకు ఎలాంటి ఫోన్ చేయలేదని చెబుతుంది. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు కదా మరి ఫోన్ ఎందుకు చేయలేదు అని రిషి చెప్పడంతో నిజంగానే నాకు ఫోన్ చేయలేదని వసుధార మాట్లాడటంతో రిషి నమ్ముతారు.

మరోవైపు రిషి ఇన్ని రోజులు నాకు మేడం వసుధార ఇద్దరు కూడా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నేనే వారి మాటలు వినడం లేదు వారు నాకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు నేను మరి ఇలాగే బెట్టు చేస్తే మంచిది కాదు ఎలాగైనా ఆ నిజం ఏంటో తెలుసుకోవాలి అని భావించి జగతికి ఫోన్ చేస్తారు. మీరు నాతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు ఏంటో చెప్పండి మేడం అని చెప్పగా ఇది ఫోన్లో చెప్పేది కాదు పర్సనల్గా మాట్లాడి అన్ని విషయాలు నీకు తెలియచేస్తాను రిషి అనడంతో సరే కానీ మీతో పాటు డాడ్ ను తీసుకురాకండి అంటూ చెబుతాడు.

ఇక తన కొడుకుకి నిజం చెప్పాలన్న కంగారులో జగతి బయలుదేరుతుంది కానీ శైలేంద్ర మాత్రం రౌడీలను ఏర్పాటు చేసి రిశిని అలాగే జగతిని చంపమని చెబుతారు ఈ మాటలు విన్నటువంటి ధరణి షాక్ అవుతుంది ఇక డబ్బు మొత్తం శైలేంద్ర తీసుకెళ్లడంతో ఆ డబ్బు ఎక్కడికి అంటూ ధరణి అడగగా ఇవన్నీ నీకు అనవసరం అంటూ ధరణిపై కోప్పడతారు. ఈయన రిషికి ఏదో హాని చేస్తున్నాడు ఎలాగైనా అడ్డుకోవాలి అని భావించిన ధరణి వెంటనే వసుధారకు ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పేస్తుంది.

ఇక జగతి రిషి ఇద్దరు ఒకచోట ఉండి మాట్లాడుతూ ఉండగా అక్కడే రౌడీలు ఉండి వారిని షూట్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వెంటనే అక్కడికి వచ్చినటువంటి వసుధార మీరిద్దరూ ఇక్కడున్నారు వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్లాలి మీరు ప్రమాదంలో ఉన్నారు అంటూ వసుధార కంగారుపడుతుంది. అయితే అప్పటికే రౌడీలు షూట్ చేయడానికి సిద్ధంగా ఉంది షూట్ చేయగా అది గమనించిన జగతి రిషికి అడ్డుగా వెళ్లడంతో ఆ బుల్లెట్ తనకు తగులుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus