బుల్లితెర ప్రేక్షకులను రోజురోజుకు ఎంతో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…రిషి తనకు జరుగుతున్నటువంటి సంఘటనల గురించి తలుచుకొని బాధపడుతూ నిద్రపోతాడు అయితే వసుధార రిషికి ఎలా ఉందోనని ఆరాటపడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే మహేంద్రకు వసుధార ఫోన్ చేసి సర్ రిషి సార్ ను నాకు చాలా చూడాలనిపిస్తుంది ఒక్కసారి వీడియో కాల్ చేయనా అంటూ తన పర్మిషన్ అడుగుతుంది. నువ్వు రిషి ని చూడటానికి నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
నీకు రిషి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఎంతో గొప్పగా ఉండాల్సిన మీరు ఇలా వీడియో కాల్ లో చూడాల్సిన అవసరం వస్తుందని నేను అనుకోలేదు అంటూ మహేంద్ర బాధపడుతూ వీడియో కాల్ చేసి రిషి ఎలా ఉన్నాడో పసుధారకు చూపిస్తాడు. మరుసటి రోజు ఉదయం విశ్వనాథం ఎస్ఐని ఇంటికి పిలిపించి రిషి పై జరిగిన అటాక్ గురించి చెబుతాడు. అదేవిధంగా మా ఇంట్లో కూడా రిషి పై అటాక్ జరిగిందని తెలిసింది అని విశ్వనాథం చెప్పడంతో ఈ విషయం ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు వాళ్ళు ఎవరైనా సరే అసలు వదిలిపెట్టను తప్పకుండా వారిని పట్టుకుంటాము అంటూ ఎస్ఐ భరోసా ఇస్తాడు.
ఇక అదే సమయంలో మహేంద్ర కావాలంటే నేను వసుధార పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తామని చెప్పడంతో సరే అని చెబుతాడు. సిటీలోని కొందరు రౌడీలను పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తారు. ఇక ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారనే విషయం తెలియడంతో రౌడీలు శైలేంద్రకు ఫోన్ చేసి మేము ఊరు వదిలి పారిపోతున్నాము. ఆ వ్యక్తి వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు పోలీసులు కూడా ఈ కేస్ చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పడంతో శైలేంద్ర మండిపోతూ ఉంటారు.
అటెండర్ గాడు కనిపిస్తే వాడిని కూడా పట్టుకెళ్ళండి అని చెబుతాడు. ఇక వాళ్లు వీళ్లను నమ్ముకుంటే పని కాదు నేనే రంగంలోకి దిగుతాను ఆ రిషి అంతం చూస్తాను అంటూ శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పోలీస్ స్టేషన్ కి వసుధార రిషి వెళ్తారు. అయితే అక్కడ ఎవరు కూడా రౌడీలు లేకపోవడంతో వారికి పక్కాగా మన గురించి అన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటూ వసుధర మాట్లాడుతుంది. వారిని సాక్షాలతో సహా పట్టుకోవాలని మహేంద్ర చెబుతారు.
స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహేంద్ర రిషిని పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఇలాంటి సమయంలో ఎన్ని వదిలి వెళ్లాలని అసలు అనిపించడం లేదు నీ పక్కనే ఉండాలని అనిపిస్తుంది అంటూ మాట్లాడటంతో మీరు ఇక్కడుండడం కన్నా అక్కడ ఉండడమే మంచిది మీరు అక్కడ ఉంటే డిపిఎస్టి కాలేజ్ పనులన్నీ ముందుకు సాగుతూ ఉంటాయని రిషి తన తండ్రికి చెప్పి పంపిస్తారు.
కాలేజీకి రిషి వెళ్ళగా తనపై అటాక్ జరిగిందనే విషయం తెలియగానే పాండియన్ బ్యాచ్ ఎలాగైనా మనసారాన్ని మనం కాపాడుకోవాలి అంటూ తనకు సెక్యూరిటీగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు రిషి మాత్రం ఇది నా పర్సనల్ నేను చూసుకోగలను కానీ మీరు మీ భవష్యత్తు పై దృష్టి పెట్టండి అని వారికి చెబుతారు. మరోవైపు మహేంద్ర జగతితో మాట్లాడుతూ మనం ఈ విషయాలన్నింటినీ రిషికి చెప్పేయడమే మంచిది అంటాడు ఆ సమయంలో జగతి మనం చెప్పిన రిషి నమ్మడు అని చెప్పడంతో నమ్ముతాడని మహేంద్ర అంటారు. ఇంతటితో (Guppedantha Manasu) ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?