జై లవ కుశ క్లైమాక్స్ లో జై చనిపోతాడా ?
- July 12, 2017 / 08:11 AM ISTByFilmy Focus
తెలుగు ఆడియన్స్ యాంటీ క్లైమాక్స్ ని ఇష్టపడరు. తాము అభిమానించే హీరో చివర్లో చచ్చిపోతే ఆ సినిమాను ఆదరించరు. యాంటీ క్లైమాక్స్ తో వచ్చిన కొన్ని తెలుగు చిత్రాలు అపజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న జై లవకుశ సినిమాలో యాంటీ క్లైమాక్స్ ఉందని సమాచారం. ఇందులో తారక్ జై, లవ, కుశ అనే పాత్రలు పోషిస్తున్నారు. జై పాత్ర రావణాసురుని ఆరాధించే పాత్ర. పూర్తిగా అరాచకాలు చేస్తుంటాడు. పాపం, పుణ్యం అని లేకుండా అడ్డు వచ్చిన వారిని చంపుతుంటాడు. అతని ఆగడాలు పెరిగిపోవడంతో చివరికి లవ, కుశ లు కలిసి జై ని చంపేస్తారంట. ఇంకా ఈ సీన్ షూటింగ్ చేయలేదు.
అయితే ఎన్టీఆర్ చివర్లో చనిపోతే అభిమానులు ఒప్పుకుంటారా? అనే సందేహం చిత్ర బృంధానాన్ని పీడిస్తోంది. వారికి నచ్చకపోతే సినిమా విజయం సాధిస్తుందా? ఈ సాహసం చెయ్యాలా? వద్దా ? అని ఆలోచిస్తున్నారు. ఎందుకైనా మంచిదని బాబీ రెండు క్లైమాక్స్ లు రాసుకున్నట్లు తెలిసింది. ఆ రెండింటిలో ఏది బాగుందని ఎక్కువమంది ఓటేస్తే అదే ఫైనల్ చేయాలనీ భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















