జై లవకుశ 3 వీక్స్ కలక్షన్స్!

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం గత నెల 21 న రిలీజ్ అయి ఆకట్టుకుంది. జై, లవ, కుశ పాత్రల్లో తారక్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ నటన, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి దోహదం చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వారాల్లో 78 . 58 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయినా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలను అందించలేదు. వారు పెట్టిన అసలు రావాలంటే ఇంకా 8 కోట్లు రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 86 కోట్లు చేసింది. మిగిలిన మొత్తం ఈ వారంలో కలెక్ట్ చేసే అవకాశం ఉంది. జై లవకుశ సాధించిన వసూళ్లు కోట్లల్లో (షేర్) .. ఏరియల్ వారీగా..

నైజాం : 16 . 50
ఉత్తరాంధ్ర : 7. 00
ఈస్ట్ : 5 .60
వెస్ట్ : 3.80
కృష్ణ : 4.66
గుంటూరు : 6.10
నెల్లూరు : 2.56
సీడెడ్ : 12.02
ఇతర రాష్ట్రాల్లో : 8.87
అమెరికా : 9.30
ఇతర దేశాల్లో : 2.20
మొత్తం : 78.58

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus