జై లవకుశ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ రామోజీఫిల్మ్ సిటీలో  వేసిన ప్రత్యేక సెట్ లో వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన ముగ్గురు భామలు నటిస్తుండగా… ఇద్దరు  ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్ హీరోయిన్లు గా ఎంపికైనట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఐటెం భామ హంసానందిని  గెస్ట్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ లోగో శ్రీరామనవమికి రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఫస్ట్ లుక్ ని కూడా ఆలస్యం లేకుండా రిలీజ్ చేయాలనీ బాబీ డిసైడ్ అయ్యారు.

తారక్ పుట్టినరోజైన మే 20 వ తేదీన నందమూరి అభిమానులు ఫస్ట్ లుక్ ని నిర్మాత కళ్యాణ్ రామ్ గిఫ్ట్ గా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి  బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్  తదితరులు శ్రమిస్తున్నారు. 55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus